Coronavirus: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ( Coronavirus ) రోజురోజుకి విజృంభిస్తూనే ఉంది. ఎప్పటిలాగానే హైదరాబాద్ నుంచే అత్యధిక కేసులు బయటపడటంతో ప్రజల భయాందోళన మరింత పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గత 24గంటల్లో 1,924 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. 11మంది మరణించారు. 992 మంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 29,536కి చేరింది. మరణాల సంఖ్య 324కి పెరిగింది. Also read: Bhadradri temple: భద్రాద్రిలో అద్భుతం.. ఆలయ శిఖరాన్ని తాకిన సూర్య కిరణం
ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ వ్యాధితో పోరాడి 17,279 మంది కోలుకోగా, ఇంకా 11,933మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,34,801 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,590కేసులు నమోదు కాగా.. ఆతర్వాత రంగారెడ్డి జిల్లాలో 99, మేడ్చల్‌లో 43 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. Also read: Haritha Haram: సర్పంచ్ 85 శాతం మొక్కలను బతికించాల్సిందే..
Telangana: 30వేలకు చేరువలో కరోనా కేసులు