Corona Second Wave In Telangana: ఏడాది కాలం నుంచి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కరోనా వైరస్, కాగా ప్రస్తుతం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది కొత్త రకం కరోనా వైరస్. బ్రిటన్ నుండి పలువురు ప్రయాణికులు భారత్‌లోని పలు రాష్ట్రాలతో పాటు తెలంగాణకు సైతం రావడం తెలిసిందే. వీరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్(Etela Rajender)  అన్నారు. కరోనా ఫస్ట్ వేవ్‌తో ప్రమాదం ఏమీ లేదని.. కానీ కరోనా సెకండ్ వేవ్‌తో ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు. విదేశాల నుంచి వస్తున్న వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 


Also Read: Gold Price Today 27th December 2020: బంగారం జోరుకు బ్రేకులు.. లేటెస్ట్ రేట్లు ఇవే!



కరీంనగర్‌లో మంత్రి ఈటల రాజేందర్ శనివారం మీడియాతో మాట్లాడారు. విదేశాల నుంచి వస్తున్న వారిలో కొందరికి కరోనా వైరస్(CoronaVirus) పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. అయితే అవి పాత కరోనా కేసులా.. కొత్త రకం కరోనా కేసులా ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. పలు దేశాలు లాక్‌డౌన్, ప్రయాణ నిషేధాలు అమలు చేస్తున్నాయని గ్రహించి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సీసీఎంబీకి శాంపిల్స్ పంపించామని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంనద్నారు.


Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి



డిసెంబర్ నెలలో కొత్త రకం వైరస్ వార్తలు మొదలైనప్పటి నుంచి బ్రిటన్ నుంచి దాదాపు 1200 మంది తెలంగాణ(Telangana)కు రాగా, వారిలో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. వీరితో సన్నిహితంగా ఉన్నవారిని సైతం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కనుక విదేశాల నుంచి వచ్చే వారితో సాధ్యమైనంత వరకు కొన్నిరోజులు భౌతికదూరం పాటించడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని రాష్ట్ర ప్రజలకు మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.


Also Read: Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: రూ.330 చెల్లిస్తే.. రూ.2 లక్షల కవరేజీ, స్కీమ్ పూర్తి వివరాలివే  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook