Coronavirus: తెలంగాణలో కొత్తగా 551 కరోనా కేసులు, రికవరీలో భేష్!
Coronavirus cases in Telangana: గత వారం తగ్గినట్లే కనిపించినా.. తాజాగా పాజిటివ్ కేసులు పెరిగాయి. నిన్న (గురువారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 551 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,80,195కి చేరింది.
Coronavirus cases in Telangana: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత వారం తగ్గినట్లే కనిపించినా.. తాజాగా పాజిటివ్ కేసులు పెరిగాయి. నిన్న (గురువారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 551 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,80,195కి చేరింది.
Also Read: Dharani portal: ఆధార్ వివరాలు అడగవద్దు
గురువారం నాడు ఒక్కరోజే 47,991 శాంపిల్స్‌కు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 551 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అదే సమయంలో కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో తెలంగాణ (Telangana)లో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,506కి చేరింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 682 మంది కరోనా వైరస్ (CoronaVirus) నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,71,649కి చేరింది.
Also Read: Worlds Highest Paid Celebrities: బావను వెనక్కినెట్టి మరీ టాప్ లేపిన ముద్దుగుమ్మ!
కాగా, తెలంగాణలో ప్రస్తుతం 7,040 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 4,955 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తెలంగాణ కరోనా రికవరీ రేటు జాతీయ సగటు కన్నా అధికంగా ఉంది. తెలంగాణలో రికవరీ రేటు 96.94శాతం ఉండగా.. జాతీయ సగటు 95.4 శాతం ఉంది. గత కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీలో పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
Also Read: EPFO: పీఎఫ్ ఖాతాలో వడ్డీ ఎప్పుడు జమకానుందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe