Dharani portal: ధరణ్ పోర్టల్ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలకాదేశాలు జారీ చేసింది. ఆధార్ వివరాల్ని అడగవద్దని స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ( Telangana Government ) కొత్తగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ( Dharani portal ) వివాదం ఇంకా ముగియలేదు. హైకోర్టు మరోసారి ఈ పోర్టల్ విషయంలో కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయేతర ఆస్థుల రిజిస్ట్రేషన్లలో ఆధార్ వివరాల్ని తొలగించాలని స్పష్టం చేసింది. ధరణి సాఫ్ట్‌వేర్ నుంచి ఆధార్ కాలమ్‌ను తొలగించేవరకూ..స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని సూచించింది. అంతేకాకుండా కులం, కుటుంబసభ్యుల వివరాల్ని కూడా తీసేయాలని తెలంగాణ హైకోర్టు ( Telangana high court ) చెప్పింది.
ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్థుల నమోదుపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని ఉల్లంఘించిందని..తెలివిగా సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తే..అంగీకరించమని కోర్టు హెచ్చరించింది.
రిజిస్ట్రేషన్‌లు యధావిధిగా కొనసాగించాలని..అయితే రిజిస్ట్రేషన్ అదారిటీ ఆధార్ వివరాల్ని( Aadhar details ) అడగవద్దని స్పష్టం చేసింది. వ్యక్తి గుర్తింపు కోసం ఆధార్ కార్డు కాకుండా మిగిలిన గుర్తింపు కార్డుల్ని అంగీకరించాలని తెలిపింది. సాఫ్ట్‌వేర్, మేన్యువల్‌లో మార్పులు చేసి కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. దీనికోసం ప్రభుత్వం గడువు కోరగా..జనవరి 20కు వాయిదా వేసింది.
Also read: DOST 2020 Registrations: ‘దోస్త్’ ప్రవేశాలకు లాస్ట్ ఛాన్స్.. నేటితో ముగియనున్న తుదిగడువు