Telangana: తెలంగాణలో 2,65,219 మందికి కరోనా పరీక్షలు
తెలంగాణలో గత 24 గంటల వ్యవధిలో 11,003 మందికి కొవిడ్-19 పరీక్షలు ( COVID-19 tests ) చేయగా.. అందులో 1198 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
హైదరాబాద్ : తెలంగాణలో గత 24 గంటల వ్యవధిలో 11,003 మందికి కొవిడ్-19 పరీక్షలు ( COVID-19 tests ) చేయగా.. అందులో 1198 మందికి కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం నేడు నమోదైన కరోనా పాజిటివ్ కేసులలోనూ ఎప్పటిలాగే అత్యధికంగా జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 510 కేసులు నమోదయ్యాయి. కరోనావైరస్ కారణంగా ఇవాళ ఏడుగురు మృతి చెందారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 422కు చేరింది. (Also read: Oxford university's vaccine: కరోనావైరస్ వ్యాక్సిన్‌పై గుడ్ న్యూస్ వచ్చేసింది )
నేడు 1885 మంది కరోనావైరస్ ( Coronavirus) నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. అలా ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 34,323 మందికి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,530 కరోనావైరస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 2,65,219 మందికి కరోనా పరీక్షలు చేయగా.. మొత్తం 46,274 కి కరోనావైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. (Also read: ICC T20 World Cup 2020: ఐసిసి టీ20 వరల్డ్ కప్ వాయిదా )