Telangana: తాజాగా 1,196 కరోనా కేసులు
CoronaVirus Cases In Telangana | కరోనా వైరస్ వ్యాప్తి యథాతథంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో తాజాగా 1,196 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కోవిడ్19 నిర్థారణ పరీక్షల్లో ఈ కేసులను గుర్తించారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి యథాతథంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో తాజాగా 1,196 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కోవిడ్19 నిర్థారణ పరీక్షల్లో ఈ కేసులను గుర్తించారు. వీటితో కలిపి తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన కరోనా వైరస్ కేసుల సంఖ్య 2,53,651కి చేరింది.
అదే సమయంలో తెలంగాణలో నిన్న ఒక్కరోజే కరోనాతో పోరాడుతూ ఐదుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1,390కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 1,745 మంది చికిత్స అనంతరం కరోనా బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా నుంచి ఇప్పటివరకూ 2,34,234 మంది కోలుకున్నారు.
- Also Read : Rajasekhar: కరోనాను జయించిన రాజశేఖర్
తెలంగాణలో నిన్న ఒక్కరోజు 44,635 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకూ
రాష్ట్రంలో చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 47,29,401కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,027 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 15,205 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 92.34శాతానికి చేరడం గమనార్హం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe