Telangana: తాజాగా 1,302 కరోనా కేసులు
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం కేసుల పెరుగుదల నుంచి కాస్త ఉపశమనం లభించింది.
Telangana Coronavirus Updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం కేసుల పెరుగుదల నుంచి కాస్త ఉపశమనం లభించింది. గత 24 గంటల్లో ఆదివారం తెలంగాణలో కొత్తగా 1,302 కరోనా కేసులు నమోదు కాగా.. 8 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు. తాజాగా నమోదైన కేసులతో.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,72,608 కి చేరగా.. మరణాల సంఖ్య 1,042 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 1,41,930 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం తెలంగాణలో 29,636 మంది చికిత్స పొందుతున్నారు. Also read: Building Collapses: భివండిలో కూలిన భవనం.. 10 మంది మృతి
ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం 31,095 కరోనా టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 25,19,315 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 82.22 శాతం ఉండగా.. మరణాల రేటు 0.60 శాతంగా ఉంది. నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీలో కొత్తగా 266 కేసులు నమోదు కాగా.. కరీంనగర్ జిల్లాలో 102, రంగారెడ్డి జిల్లాలో 98, సిద్దిపేటల జిల్లాలో 92 కేసులు నమోదయ్యాయి. Also read: Gold Price Today: మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు