Telangana: కొత్తగా 2,166 కరోనా కేసులు
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో నిన్న తగ్గిన కరోనా కేసులు మళ్లీ రెండువేల మార్కును దాటాయి.
Telangana Coronavirus Updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో నిన్న తగ్గిన కరోనా కేసులు మళ్లీ రెండువేల మార్కును దాటాయి. గత 24 గంటల్లో సోమవారం తెలంగాణ (Telangana) లో కొత్తగా 2,166 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 10 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,74,774 కి చేరగా.. మరణాల సంఖ్య 1,052 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. అయితే.. నిన్న ఒక్కరోజే వైరస్ నుంచి 2,143 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 1,44,073 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం తెలంగాణలో 29,649 మంది చికిత్స పొందుతున్నారు. Also read: Building Collapses:18కి చేరిన భివండి మృతుల సంఖ్య
ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం 53,690 కరోనా టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 25,73,005 (coronavirus tests) నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 82.43 శాతం ఉండగా.. మరణాల రేటు 0.60 శాతంగా ఉంది. అయితే నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 309 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. Also read: Devdutt Padikkal in IPL : ఐపిఎల్ తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ.. ఎవరీ దేవ్‌దత్ పడిక్కల్ ?