Building Collapses:18కి చేరిన భివండి మృతుల సంఖ్య

మహారాష్ట్ర (Maharashtra) లోని థానే భీవండి పట్టణం (Bhiwandi ) లో సోమవారం తెల్లవారుజామున మూడంతస్థుల భవనం కుప్పకూలి ( building collapses ) ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.

Last Updated : Sep 22, 2020, 08:53 AM IST
Building Collapses:18కి చేరిన భివండి మృతుల సంఖ్య

Bhiwandi building collapses Incident: భివండి: మహారాష్ట్ర (Maharashtra) లోని థానే భీవండి పట్టణం (Bhiwandi ) లో సోమవారం తెల్లవారుజామున మూడంతస్థుల భవనం కుప్పకూలి ( building collapses ) ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 18కి చేరినట్లు థానే మునిసిపల్ కార్పోరేషన్ అధికారులు మంగళవారం ఉదయం వెల్లడించారు. ఇప్పటివరకు సహాయక చర్యల్లో 20మందిని రక్షించినట్లు ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బంది తెలిపారు. అయితే ఈ భవనం శిథిలావస్థకు చేరడంతోనే కుప్పకూలినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ మేరకు థానే మునిసిపల్ కార్పొరేషన్ ఇద్దరు అధికారులపై వేటు వేస్తూ చర్యలు తీసుకుంది. 

అయితే 1984లో నిర్మించిన భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి.. అందరూ గాఢ నిద్రలో ఉండగానే కుప్పకూలింది. వెంటనే చుట్టుపక్కల నివసిస్తున్న వారు వచ్చి 20 మందిని కాపాడారు. అనంతరం పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (NDRF) బృందాలు చేరుకొని సహాయక చర్యలను చేపట్టాయి. ఇంకా ఈ భవన శిథిలాల కింద క్షతగాత్రులు ఉంటారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా రెస్క్యూ కొనసాగుతూనే ఉంది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడిస్తున్నారు. Also read: Devdutt Padikkal in IPL : ఐపిఎల్ తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ.. ఎవరీ దేవ్‌దత్ పడిక్కల్ ?

ఇదిలాఉంటే ఈ ప్రమాదంపై సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. ఈ మేరకు వారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇదిలాఉంటే ఆగస్టు 24న మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్‌లో కూడా ఐదంస్థుల భవనం కూలి దాదాపు 18 మంది వరకు మరణించిన సంగతి తెలిసిందే. Also read: 3D Player Vijay Shankar: ఒక్క బంతికి 10 పరుగులు ఇచ్చిన విజయ్ శంకర్

Trending News