Telangana Covid-19: 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు
లంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిత్యం రెండువేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలకు చేరువైంది.
Telangana Coronavirus Updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిత్యం రెండువేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో శనివారం ( అక్టోబరు 3 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,949 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 10 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,99,276 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,163 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. అయితే ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 1,70,212 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం తెలంగాణలో 27,901 మంది చికిత్స పొందుతున్నారు. Also read: Bihar Assembly Election 2020: మహాకూటమి రథసారధిగా తేజస్వి యాదవ్
ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా శనివారం 51,623 కరోనా టెస్టులు చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో అక్టోబరు 3 వరకు రాష్ట్రంలో 32,05,249 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. అయితే నిన్న రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 291 కరో్నా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 156, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 150 పాజిటివ్ కేసులు చొప్పున కేసులు నమోదయ్యాయి.
[[{"fid":"194345","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."}},"link_text":false,"attributes":{"alt":"telangana corona cases bulletin ","title":"తెలంగాణలో కరోనా కేసులు..","class":"media-element file-default","data-delta":"1"}}]]
Also read: Harthras Case: హత్రాస్ కేసును సీబీఐకి అప్పగించిన సీఎం యోగి