Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే రెండు మూడు రోజుల నుంచి 1500లకు చేరువులో నమోదవుతున్న కేసులు మళ్లీ వేయికి తక్కువగా నమోదయ్యాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రాష్ట్రంలో కరోనా కేసుల కన్నా.. రికవరీ రేటు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతూనే ఉంది. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా తక్కువగానే నమోదవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 92.12 శాతం ఉండగా.. మరణాల రేటు 0.55 శాతం ఉంది. అయితే గత 24 గంటల్లో ఆదివారం ( నవంబరు 1 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 922 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఏడుగురు (7) మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Tedros Adhanom Ghebreyesus: క్వారంటైన్‌లోకి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,40,970 కి చేరగా.. మరణాల సంఖ్య 1,348 కి పెరిగింది. గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 1,456 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,21,992 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 17,630 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. Also read: Pawan Kalyan Movie Shooting: రంగంలోకి దిగిన వకీల్ సాబ్


ఇదిలావుంటే.. ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా 25,643 కరోనా పరీక్షలు చేశారు. దీంతో నవంబరు 1వ తేదీ వరకు మొత్తం 43,49,309 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా..  జీహెచ్ఎంసీ పరిధిలో 256 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.


[[{"fid":"196389","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."}},"link_text":false,"attributes":{"alt":"telangana corona cases bulletin ","title":"తెలంగాణలో కరోనా కేసులు..","class":"media-element file-default","data-delta":"1"}}]]


 


 Also read : SRH Playoffs: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అంత ఈజీ కాదు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe