COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 68,097 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. వారిలో 298 మందికి కరోనా సోకినట్టు తేలింది. కొత్తగా నమోదైన కేసుల్లో 89 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోవి (GHMC) కాగా, కరీంనగర్ జిల్లాలో 24 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 21 కేసులు, వరంగల్ అర్బన్ జిల్లాలో 21 కేసులు నమోదయ్యాయి. కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్,  నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడిచిన 24 గంటల్లో 325 మంది కరోనా నుంచి కోలుకోగా మరో ఇద్దరు కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో (COVID-19 deaths) చనిపోయిన వారి సంఖ్య మొత్తం 3,888కి పెరిగింది. 


Also read : Nipah Virus: కేరళలో 'నిఫా' కల్లోలం! ఈ వైరస్ కు మందు లేదు..కట్టడి ఒక్కటే మార్గం!


రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా హెల్త్ బులెటిన్‌లోని వివరాల ప్రకారం తెలంగాణలో ఇప్పటివరకు 6,60,142 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఇప్పటివరకు కరోనా వైరస్ (Coronavirus) నుంచి నయమైన వారి సంఖ్య 6,50,778 మందికి చేరుకుంది. ప్రస్తుతం 5,476 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.


Also read : COVID booster shot: కోవిడ్ బూస్టర్ షాట్‌ వ్యాక్సిన్ అంటే ఏంటి? ఎవరు తీసుకోవాలి ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook