Nipah Virus: కేరళలో 'నిఫా' కల్లోలం! ఈ వైరస్ కు మందు లేదు..కట్టడి ఒక్కటే మార్గం!

Nipah Virus:  కేరళను నిఫా వైరస్ వణికిస్తోంది. అయితే నిఫా వైరస్ లక్షణాలు ఏంటి? మెుదట సారిగా ఎప్పడు బయటపడింది? చికిత్స ఉందా లేదా తదితర విషయాలు తెలుసుకుందాం.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 7, 2021, 04:40 PM IST
  • కేరళలో నిఫా వైరస్ కలకలం
  • తాజాగా 12ఏళ్ల బాలుడి మృతి
  • 1999లో తొలిసారిగా మలేషియాలో గుర్తింపు
Nipah Virus: కేరళలో 'నిఫా' కల్లోలం! ఈ వైరస్ కు మందు లేదు..కట్టడి ఒక్కటే మార్గం!

Nipah Virus:  ఓ వైపు కరోనా, మరోవైపు నిఫా వైరస్‌ కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. నిఫా కలకలంతో అప్రమత్తమైన కేరళ సర్కార్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఏకకాలంలో రెండు వైరస్‌లతో పోరాడాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా వైరస్‌(Coronavirus) భీకరంగా వ్యాపిస్తుండగా.. తాజాగా నిపా వైరస్‌ కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండు వైరస్‌లు గబ్బిలాల(Bats) నుంచి వచ్చినవే. కానీ.. వీటి లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి.

కేరళ(Kerala)లో చాపకింద నీరులా విస్తరిస్తోంది నిఫా వైరస్(Nipah Virus). తాజాగా కోజికోడ్ జిల్లా(Kozhikode District)లో నిఫా వైరస్‌ బారిన పడి 12 ఏళ్ల బాలుడు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. నిఫా వైరస్‌ కలకలంతో అటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కేరళ ఆరోగ్య శాఖకు సహకారంగా కేంద్రం తరఫున ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపింది. ప్రస్తుతం ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో పరిశీలన జరుగుతున్నట్లు వైద్య అధికారులు తెలిపారు.

ఇండియాలో ఎప్పుడంటే..
కేరళలో 2018 జూన్‌లో తొలిసారిగా నిఫా వైరస్‌(Nipah Virus) వెలుగులోకి వచ్చింది. మొత్తం 23 కేసులను నిర్ధారించారు. వీరిలో కేవలం ఇద్దరు మాత్రమే కోలుకున్నట్లు తెలిపారు అధికారులు. 2019లో ఒకరిలో నిఫా వైరస్‌ మరోసారి నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకోవడంతో ఈ వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. తాజాగా నిఫా వైరస్‌తో బాలుడు మరణించడంతో ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు ప్రారంభించింది. 

వ్యాధి లక్షణాలు ఏంటంటే..
నిపా వైరస్‌ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుంది. దీనిని జునోటిక్‌ వ్యాధి అంటారు. దీనిని 1999లో తొలిసారిగా మలేషియా(Malaysia)లో నిఫా వైరస్‌ను నిపుణులు గుర్తించారు. ఆ తర్వాత 2001లో బంగ్లాదేశ్‌లో నిఫా కేసులు వెలుగుచూశాయి. ఒకరి నుంచి ఒకరిని తాకడం వల్ల ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. 14 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. తలనొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం, తలతిరగడం, వాంతులు, జ్వరం ఈ వైరస్‌ లక్షణాలని చెబుతున్నారు. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ముఖ్యంగా రక్తం, మూత్రం, ముక్కు, నోటి నుంచి వచ్చే స్రావాల్లో వైరస్‌ ఉంటుంది. 

ఇది చాలా ప్రమాదకరం...
2018లో కేరళలో వచ్చిన కేసులు పెరంబ్ర తాలుకా ఆసుపత్రి, కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీలోనే నమోదయ్యాయి. తొలి రోగికి ఇక్కడే చికిత్స చేశారు. వైరస్ తీవ్రత ఎక్కువైతే 24 నుంచి 48 గంటల్లోనే బాధితులు మృతి చెందే ప్రమాదముంది. గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించే ఈ వైరస్‌ వెరీ డేంజరస్‌ అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO). ఇప్పటివరకు ట్రీట్‌మెంట్‌ లేని ఈ ప్రాణాంతక వైరస్​ నుంచి ప్రజలను రక్షించుకోవాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తోంది. నిపా వైరస్‌ ఆతిథ్య జీవుల జాబితాలో పందులు, ఫ్రూట్‌ బ్యాట్‌ అనే గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రూట్‌ బ్యాట్స్‌లో ఇవి సహజంగానే ఉంటాయి. వాటిపై ఎటువంటి ప్రభావం చూపించలేవు.

చికిత్స ఎలా ఉంటుంది..
నిపా వైరస్‌కు వైద్యం లేదు. ఇప్పటి వరకు అనుమతి పొందిన ఏ ఔషధం అందుబాటులోకి రాలేదు. రోగిని వేరుగా ఉంచుతున్నారు. తగినంత నీరు అందిస్తున్నారు. దీంతోపాటు రోగి లక్షణాలకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ చికిత్స విధానం వినియోగించడంపై పరిశోధనలు జరుగుతున్నాయి. నిపాపై వాడేందుకు పలు యాంటీవైరల్‌ డ్రగ్స్‌ను సీఈపీఐ ప్రయోగాత్మకంగా పరీక్షించింది. కానీ, అవి జంతువుల్లో మాత్రమే మంచి ఫలితాలను చూపించాయి. కోవిడ్‌(Covid-19)తో పోలిస్తే నిపా వైరస్‌ అత్యంత ప్రమాదకరమైంది. కాకపోతే ఇది వేగంగా వ్యాపించకపోవడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. గ్లోబల్‌ వైరస్‌ నెట్‌వర్క్‌ ప్రకారం నిపా వైరస్‌ ఆర్‌నాట్‌ 0.43. అంటే 100 మంది నిపా వైరస్‌ బాధితుల నుంచి కేవలం మరో 43 మందికే వ్యాధి వ్యాపిస్తుందన్నమాట. కానీ, వ్యాధి సోకిన వారిలో 45శాతం నుంచి 70శాతం మంది మరణిస్తున్నారు. కేరళలో 19 మందికి వైరస్‌ సోకితే 17 మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ ఆర్‌నాట్‌ తరచూ 1కిపై గా నమోదవుతోంది. అంటే నిపాతో పోలిస్తే ఇది వేగంగా వ్యాపిస్తోందన్నమాట. చాలా మంది స్వల్ప లక్షణాలతో బయటపడుతున్నారు. మరణాల రేటు కూడా 1శాతం కంటే తక్కువగా ఉంటోంది.

నిఫా వైరస్‌ను ఎలా గుర్తించడం..
నిపా వైరస్‌ను గుర్తించడానికి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష(RTPCR Test)ను నిర్వహిస్తారు. దీంతోపాటు పాలిమరైజ్‌ ఛైన్‌ రీయాక్షన్‌ పరీక్షలో కూడా కచ్చితమైన సమాచారం తెలుస్తుంది. ఈ పరీక్షలో అత్యంత సున్నితమైన మార్పులను గుర్తించే అవకాశం ఉంది. పీసీఆర్‌ పరీక్ష(PCR Test)కు ప్రాధాన్యమిస్తారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News