Corona R Value: కరోనా మహమ్మారి ఇండియాలో క్రమంగా పెరుగుతోంది. ఇండియా ఆర్ వ్యాల్యూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. పెరుగుతున్న ఆర్ వ్యాల్యూ కరోనా థర్డ్‌వేవ్‌కు సంకేతమా అనే వాదన విన్పిస్తోంది.
ఇండియాలో గత కొద్దికాలంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో ఆర్ వ్యాల్యూ(Corona R Value)సైతం పెరుగుతోంది. ఆర్ వ్యాల్యూ అంటే..ఒక రోగి నుంచి ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే సగటు వ్యక్తుల అంచనా. గత వారం రోజులుగా ఇండియాలో ఇది పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో ఆర్ వ్యాల్యూ 1.17 గా ఉంది. వారం రోజుల క్రితం ఇదే ఆర్ వ్యాల్యూ 0.083 ఉంది. కేరళ, మహారాష్ట్రలలో వేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు..దేశంలోని ఆర్ వ్యాల్యూ పెరగడానికి కారణమైంది. 2021 మార్చ్ 19వ తేదీన ఇండియాలో ఆర్ వ్యాల్యూ 1.19 ఉంది. ఆ తరువాతే దేశంలో కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడింది.
ఆర్ ఫ్యాక్టర్ అంటే రీ ప్రొడక్షన్ రేటు. ఒక కోవిడ్ రోగి ఎంతమందికి కోవిడ్ ను సంక్రమింపచేయగలడనేది ఆర్ ఫ్యాక్టర్. ఆర్ ఫ్యాక్టర్ 1 కంటే ఎక్కువ ఉంటే కేసులు పెరుగుతున్నట్టు అంచనా. అదే సమయంలో ఆర్ ఫ్యాక్టర్ 1 కంటే తక్కువ ఉంటే..కేసులు తగ్గుతున్నట్టు లెక్క. వందమంది కోవిడ్ బాధితుల ద్వారా మరో వందమందికి కరోనా సంక్రమిస్తే..ఆర్ ఫ్యాక్టర్ విలువ 1గా ఉంటుంది. అదే వందమంది 80 మందికి మాత్రమే కరోనా(Coronavirus)సంక్రమింపజేస్తే..ఆర్ ఫ్యాక్టర్ 0.80గా ఉందని అర్ధం. కేరళలో గత వారం ఆర్ వ్యాల్యూ 0.87 కాగా, ఈ వారం 1.33కు పెరిగింది. అటువ మహారాష్ట్రలో కూడా 1.06కు పెరిగింది. ఏపీలో ఆర్ వ్యాల్యూ 0.87 నుంచి 1.09కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం ఆర్ వ్యాల్యూ పెరుగుతోంది. ఆర్ వ్యాల్యూ పెరిగే కొద్దీ ఇండియాలో కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave) భయం పెరుగుతున్నట్టుగా అంచనా వేయవచ్చు.
Also read: Health tips: మీ శరీరంలో రక్తం తక్కువగా ఉందా? అయితే ఈ Fruit జ్యూస్ తాగండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook