Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కోవిడ్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. నిన్న 300లలోపే కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ( జనవరి 1న ) శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 293 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా ఇద్దరు (2) మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also Read: COVID-19: ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా.. వారి నుంచి మరో ఆరుగురికి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణ (Telangana) లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల (positive cases) సంఖ్య 2,87,108 కి చేరగా మరణాల సంఖ్య 1,546 కి పెరిగింది. కేసులతోపాటు నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. కరోనా నుంచి నిన్న 535 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,79,991 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 5,571 (Covid-19) యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.52 శాతం ఉండగా.. మరణాల రేటు 0.53 శాతం ఉంది. 


Nidhhi Agerwal: బ్యూటీ నిధి అగర్వాల్ లేటెస్ట్ పిక్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook