COVID-19: ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా.. వారి నుంచి మరో ఆరుగురికి..

22 Members of a family tested positive for COVID-19 | సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబంలో 22 మందికి క‌రోనావైరస్ సోకడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో తమ బంధువు మృతి చెందగా.. ఆయన అంత్యక్రియలకు హాజరై వచ్చిన అనంతరం వారికి కరోనా సోకినట్టు వైద్యాధికారులు గుర్తించారు.

Last Updated : Jan 1, 2021, 08:29 PM IST
COVID-19: ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా.. వారి నుంచి మరో ఆరుగురికి..

22 Members of a family tested positive for COVID-19 | సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబంలో 22 మందికి క‌రోనావైరస్ సోకడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యాదాద్రి టౌన్‌షిప్‌లో ఈ కుటుంబం నివాసం ఉంటోంది. ఇటీవల హైదరాబాద్‌లో తమ బంధువు మృతి చెందగా.. ఆయన అంత్యక్రియలకు హాజరై వచ్చిన అనంతరం వారికి కరోనా సోకినట్టు వైద్యాధికారులు గుర్తించారు. 

ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా ఘటనపై డీఎంహెచ్‌ఓ హర్షవర్ధన్‌ మాట్లాడుతూ.. అంత్యక్రియలకు హాజరైన వారిలో ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో కొవిడ్-19 పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలిందని తెలిపారు. దీంతో మిగ‌తా కుటుంబసభ్యులకు సైతం అనుమానంతో కరోనా పరీక్షలు నిర్వహించగా కుటుంబంలో ఉన్న వాళ్లందరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వెల్లడించారు. ఆ కుటుంబంలో ఒక్కరికి మినహాయించి మిగతా వారిలో ఎవ్వరికీ కరోనా లక్షణాలు ( Coronavirus symptoms ) లేవని హర్షవర్ధన్ పేర్కొన్నారు.

Also read : Telangana Covid-19: కొత్తగా 461 కరోనా కేసులు

బాధితులు అందరూ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ( Home quarantine ) ఉండగా అంతకంటే ముందే ఈ 22 మందితో కాంటాక్టులోకి వచ్చిన మరో ఆరుగురికి సైతం కరోనా సోకినట్టు తెలుస్తుండటంతో అక్కడి పరిసర ప్రాంతాల ప్రజలు హడలిపోతున్నారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు యాదాద్రి టౌన్‌‌షిప్‌లో ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి కరోనా పరీక్షలు ( Coronavirus tests ) నిర్వహిస్తూ వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also read : India Covid-19: గత 24గంటల్లో 20,036 కరోనా కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News