TS Covid-19 cases: హైద‌రాబాద్‌: ‌తెలంగాణలో కరోనావైరస్ ( coronavirus ) కేసులు, మరణాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీరోజూ అత్యధికంగా జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో (శనివారం) తెలంగాణ ( Telangana ) వ్యాప్తంగా కొత్త‌గా 1102 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా మరో 9 మంది మ‌ర‌ణించినట్లు వైద్యఆరోగ్యశాఖ (TS Health Ministry) ఆదివారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 91,361కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 693 మంది క‌రోనాతో మరణించారు. Also read: Bigg Boss Telugu: సీజన్-4 ప్రోమో విడుదల


ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడి 68,126 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 22,542 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. శనివారం కరోనా నుంచి 1,930మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. శనివారం న‌మోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 234 కేసులు నమోదుకాగా.. క‌రీంనగ‌ర్ జిల్లాలో 101, రంగారెడ్డి జిల్లాలో 81, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లాలో 63, సంగారెడ్డి జిల్లాలో 66 చొప్పున‌ కేసులు నమోదయ్యాయి. Also read: MS Dhoni retirement: సాక్షి ఎమోషనల్ పోస్ట్