తెలంగాణ CPI సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ కన్నుమూశారు (Gunda Mallesh Passes Away). గత కొంతకాలం నుంచి ఆయన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల కిందట హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మంగళవారం తుదిశ్వాస విడిచారు (Gunda Mallesh Dies). ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొంది ఎమ్మెల్యేగా పలు పర్యాయాలు సేవలందించారు. సీపీఐ శాసనసభా పక్ష నేతగానూ రాణించారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ (CM KCR) సంతాపం ప్రకటించారు. సీపీఐ సీనియర్ నేత మృతిపట్ల తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు సంతాపం ప్రకటించి, గుండా మల్లేశ్ కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన మల్లేశ్ తో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. మల్లేశ్ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.



 



 


 


‘తెలంగాణ సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ గుండా మల్లేశ్ గారి మరణం దురదృష్టకరం. నిత్యం ప్రజల్లో ఉంటూ  సామాన్యుల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.


 



 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe