Cybercrimes in Telangana: 2021లో దేశవ్యాప్తంగా అత్యధికంగా సైబర్ క్రైమ్స్ నమోదైన అన్ని రాష్ట్రాల జాబితాలో తెలంగాణనే టాప్‌లో ఉంది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఏటీఎం ఫ్రాడ్స్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఫ్రాడ్, ఓటిపితో జరిగే మోసాలు, ఇతర సైబర్ క్రైమ్స్ అన్నీ కలిపి 2021 లో తెలంగాణలో 7003 సైబర్ క్రైమ్స్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 7003 సైబర్ నేరాల్లో 579 మందిపై ఛార్జ్ షీట్ నమోదు చేసినట్టు పార్లమెంట్ లో ప్రశ్నోత్తరాల సమయంలో సర్కారు వెల్లడించింది. తెలంగాణ తరువాత మహారాష్ట్రలోనే అత్యధికంగా 1678 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. బిహార్‌లో 1373 సైబర్ నేరాలు, 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో భారీగా పెరిగిన సైబర్ నేరాలు
తెలంగాణలో గత మూడేళ్లలో సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. 2019 లో 282 గా ఉన్న ఈ సంఖ్య 2020 లో 3,316 కి చేరింది. ఆ మరుసటి ఏడాది అయిన 2021 లో ఆ సంఖ్య రెండు రెట్లను మించి 7003 కి పెరిగింది. సైబర్ ఎక్స్‌పర్ట్ కోటిరెడ్డి మాధవ రెడ్డి ఈ సైబర్ నేరాల గురించి వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణలో సైబర్ నేరాలు అధికంగా ఉన్నాయంటే రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఉన్నారని అర్థం కాదని అన్నారు. రాష్ట్రంలో సైబర్ నేరాల బారిన పడిన బాధితులు సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు. సైబర్ నేరస్తుల బారిన పడిన వారిలో కొంతమంది బాధితులు మోసపోవడానికి వారి అమాయకత్వమే అందుకు ఓ కారణమైతే.. ఇంకొన్ని ఘటనల్లో దురాశే వారు మోసపోవడానికి కారణమవుతుంది అని అభిప్రాయపడ్డారు. 


వీటితో చాలా జాగ్రత్త..
89 రకాల సైబర్ క్రైమ్స్ పద్ధతులు ఉన్నాయని.. ఏదేమైనా సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే గుర్తుతెలియని లింక్సుపై క్లిక్ చేయడం మానేయాలి. అలాగే స్పామ్ మెస్సేజులు, మెయిల్స్‌కి స్పందించకుండా ఉండాలి. ఓటిపీలను ఇతరులతో పంచుకోరాదు. కొంతమంది ఫ్రాడ్‌స్టర్స్ మీ మొబైల్‌కి వచ్చిన ఓటిపిని కూడా దొంగిలించగలరు. ఆఫర్స్, లక్కీడ్రా, లాటరీల పేరుతో వచ్చే లింక్స్‌పై క్లిక్ చేయకూడదు. క్యూఆర్ కోడ్స్ స్కానింగ్ చేసే సమయంలోనూ అజాగ్రత్త అస్సలే పనికిరాదు. 


శిక్షపడిన కేసులు సంఖ్య కూడా ఎక్కువే..
తెలంగాణలో నమోదైన సైబర్ నేరాల కేసుల సంఖ్య మాత్రమే కాదు.. ఆయా కేసుల్లో శిక్షపడిన నేరస్తుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 2020లో నమోదైన సైబర్ క్రైమ్ కేసుల్లో 202 కేసుల్లో నేరస్తులకు శిక్ష పడింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా శిక్షపడిన కేసుల సంఖ్యలో ఉత్తర్ ప్రదేశ్‌తో పాటు తెలంగాణ ముందంజలో ఉంది. నల్సార్ యూనివర్శిటీలో సైబర్ క్రైమ్ లాస్ అసోసియేట్ ప్రొఫెసర్ మాట్లాడుతూ.. సైబర్ నేరాల్లో నిందితులకు శిక్షపడేలా చేయడం కూడా క్లిష్టమైన సమస్యే అని అన్నారు. నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సంపాదించడం కష్టంగా మారడమే అందుకు కారణంగా చెప్పారు. అంతేకాకుండా ఒక్క సైబర్ టెర్రరిజం కేసుల్లో మాత్రమే జీవిత ఖైదు విధిస్తారని.. మిగతా కేసుల్లో 2 నుంచి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారని తెలిపారు.


ఇది కూడా చదవండి: Hyderabad Prostitution Racket: హైదరాబాద్‌లో సంచలన కేసు.. ఇంటర్నేషనల్ వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఏకంగా 1419 మంది అమ్మాయిలతో..


ఇది కూడా చదవండి: Ahinaya Cheating: నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది.. ఐదో పెళ్ళికి సిద్ధమవుతుండగా ఇలా దొరికేసింది!


ఇది కూడా చదవండి: Man ate woman: యువతిని రేప్ చేసి, చంపి, మాంసం తిని, శిక్ష లేకుండా తప్పించుకున్నాడు.. కానీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook