Etela Rajender's counter to CM KCR's chinnodu comments: కరీంనగర్: మేం చిన్నోళ్లమో.. పనికిమాలినోళ్లమో ప్రజలే తీర్పు ఇస్తారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తనుగుల ఎంపీటీసీ నిరోషా భర్త రామస్వామితో సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడుతూ (CM KCR phone call audio leaked) తనపై చేసిన కామెంట్స్‌పై ఈటల రాజేందర్ స్పందించారు. ఇల్లంతకుంట మండలం కనగర్తిలో పాదయాత్ర నిర్వహించిన సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. '' ఇంతకు ముందే హుజురాబాద్‌లో ఓ వ్యక్తితో కేసీఆర్ మాట్లాడుతూ ఈటల రాజేందర్ ఓ చిన్న మనిషని చెబుతున్నాడు. నేను చిన్నమనిషినే కావొచ్చేమో.. కానీ బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి చస్తుందనే విషయాన్ని గుర్తుంచుకో అని హెచ్చరించారు. మేమ నీ దృష్టిలో చిన్నవాళ్లమే కావచ్చు. కానీ రోషం, ఆత్మాభిమానం కలిగిన బిడ్డలం. చిచ్చరపిడుగుల్లా కొట్లాడే తత్వం ఉన్నవాళ్లం. ఆనాడు వై.ఎస్ రాజశేఖర్ రెడ్డితో, కిరణ్ కుమార్ రెడ్డితోనే కొట్లాడినోళ్లం'' అంటూ ఈటల రాజేందర్ మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Huzurabad bypolls: హుజురాబాద్ ఉప ఎన్నికలో గుద్దుడు గుద్దుతరు.. 
''హుజురాబాద్ ఉప ఎన్నికలో గుద్దుడు గుద్దుతరు.. మేము చిన్నోళ్లం కాదని, పనికిమాలినోళ్లం కాదని ఓటర్లే తీర్పునిస్తారు. మీరు బీ-ఫారం ఇస్తేనే అందరూ గెలవరు. నీ ఫొటో పెట్టుకున్నంత మాత్రాన్నే గెలవరు. ఒకవేళ అదే నిజం అనుకున్నట్టయితే.. మరి నిజామాబాద్‌లో నీ బిడ్డ ఎందుకు ఓడిపోయింది. ప్రజలకు సేవచేసే నాయకులుంటేనే గెలుస్తారు. పాద యాత్రతో (Etela Rajender pada yatra) గత ఆరు రోజులుగా నాకాళ్లన్నీ గుంజుతున్నాయ్. ఇంత కష్టపడుతున్నందుకు నీ శ్రమ వృథా పోదు అని ప్రజలే ధైర్యం చెబుతున్నారు అని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తంచేశారు. 


Also read : Etela Rajender చిన్నోడు.. ఈటల వచ్చేది లేదు సచ్చేది లేదు.. CM KCR phone call leaked


అందుకే పార్టీలోంచి బయటికొచ్చా..
కనగర్తి గ్రామంలో గతంలో 70 శాతం ఓట్లు వేశారు. ఈసారి మొత్తం నాకే వేయమని అడుగుతున్నా. కేసీఆర్ కుట్రలను చేధించే శక్తిని నాకు ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తున్నా.ఈ రాష్ట్రంలో నేను తిరగని జిల్లా లేదు. స్వీకరించని దరఖాస్తు లేదు. సమైక్య రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ, ఏ కష్టాలున్నా.. నాకు చెప్పి అసెంబ్లీలో ప్రస్తావించమని అడిగేవాళ్లు. అనాడైనా, ఈనాడైనా నేను ప్రజల కష్టాల వైపే ఉన్నాను. ఇకపై కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నాను. లేదంటే చరిత్ర హీనుడిగా మిగిలిపోతా. అది నాకు ఇష్టం లేదు కనుకే టీఆర్ఎస్ పార్టీలోంచి (TRS Party) బయటకు రావాల్సి వచ్చింది అని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు.  


ఈసారికి జెండాలు, పార్టీలు పక్కన పెట్టండి..


గుడిసెలో ఉన్నోడికైనా, బంగ్లాలో ఉన్నోడికైనా ఓటు హక్కు ఒక్కటే. ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఓటును నాకు వేయండని అడుగుతున్నా. వందల కోట్లు ఖర్చు పెట్టినా, గొర్లు, కమ్యూనిటీ హాళ్లు, దళిత బంధు లాంటి పథకాలు (Dalitha bandhu scheme) ఎన్ని ఇచ్చినా... అవన్నీ నా వల్లే వస్తున్నాయి. ఓ యాదవ బిడ్డ నాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చే గొర్లు (Gorlu) లేకున్నా మంచిదే కానీ మా ఓటు నీకే వేస్తామని చెప్పాడు. ఈసారి జెండాలు, పార్టీలు పక్కన పెట్టి మీ బిడ్డగా నిండు మనస్సుతో ఆశీర్వదించండి'' అని ఈటల రాజేందర్ (Etala Rajender) హుజురాబాద్ ఓటర్లను విజ్ఞప్తి చేశారు.


Also read : TRS MP Maloth Kavitha: టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవితకు 6 నెలల జైలు శిక్ష


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook