Dussehra Holidays 2024 in Telugu: దసరా సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈసారి ఏకంగా 13 రోజులు దసరా, బతుకమ్మ సెలవులు ఉంటాయి. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి 14వ తేదీ వరకూ సెలవులు కొనసాగుతాయి. తిరిగి అక్టోబర్ 15న పాఠశాలలు తెర్చుకోనున్నాయి. ఏపీలో మాత్రం అక్టోబర్ 4 నుంచి 13వ తేదీ వరకు 10 రోజులు సెలవులుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్టోబర్ నెలలో తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు వరుసగా 13 రోజులు సెలవులున్నాయి. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకూ సెలవులు ఇచ్చేసింది ప్రభుత్వం. ఈ 13 రోజుల్లో అక్టోబర్ 2 గాంధీ జయంతి కాగా మిగిలిన రోజుల్లో దసరా, బతుకమ్మ రెండు పండుగలు ఉంటాయి. తెలంగాణలో బతుకమ్మ ప్రధాన పండుగ కావడంతో రెండు సెలవులు కలిపి ఇచ్చేశారు. తెలంగాణ ప్రభుత్వం మే 25న విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం కూడా ఇవే సెలవులు ఉన్నాయి. వీటిలో ఎలాంటి మార్పు చేయలేదు. అక్టోబర్ 2 నుంచి 14 వరకూ మొత్తం 13 రోజుల సెలవులు ఇచ్చింది. ఇక క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఉంటాయి.వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకూ  సంక్రాంతి సెలవులుంటాయి. మార్చ్ నెలలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. 


ఇటు ఆంధ్రప్రదేశ్‌లో సైతం దసరా సెలవులపై స్పష్టత వచ్చింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 4 నుంచి 13 వరకూ పది రోజుల సెలవులుంటాయి. క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు కూడా ఇవే సెలవులు. ఈ సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి 29 వరకు ఉంటాయి. ఇక సంక్రాంతి సెలవులు ఏపీలో వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయి. అంటే ఏపీలో దసరాకు 10 రోజులు, సంక్రాంతికి 9 రోజుల సెలవులు ఉంటాయి.


Also read: Tirumala Laddu Dispute: తిరుమల లడ్డూ వివాదంలో పవన్ కళ్యాణ్ యూ టర్న్, జగన్ తప్పు లేదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి