BRS Party: తెలంగాణ తల్లికి కిరీటం తీసేస్తే దేవుళ్లకు కూడా కిరీటం తీస్తారా?
Dasoju Sravan Kumar Comments On Telangana Thalli Statue: మార్పు పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న దారుణాలకు అడ్డూ అదుపు లేదని.. పని లేని వ్యక్తి పిల్లి తలకాయ కొరిగినట్టు రేవంత్ రెడ్డి తీరు ఉందని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు.
Telangana Thalli Statue: తెలంగాణపై విషం చిమ్ముతూ నెగటివ్ మైండ్‌సెట్‌తో రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు. 'తెలంగాణ తల్లి విగ్రహ మార్పు విషయంలోనూ రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారు. పనిలేని ఆయన పిల్లి తలకాయ కొరిగినట్టు ఉంది రేవంత్ రెడ్డి తీరు ఉంది' అని మండిపడ్డారు. తెలంగాణ తల్లి రూపానికి ఓ చరిత్ర ఉందని ప్రకటించారు. అలాంటి విగ్రహ రూపం మారిస్తే దేవుళ్ల రూపం కూడా మార్చాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
Also Read: KTR Break: 'నేను రెస్ట్ తీసుకుంటా.. ఇక చెల్లి, బావ మీరు తగులుకోరి': కేటీఆర్
హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో దాసోజు శ్రవణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ తల్లి రూపానికి ఓ చరిత్ర ఉంది. 2006లో కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పుడు తెలంగాణ తల్లి రూప విషయమై చాలా మందితో చర్చించారు. తెలంగాణ తల్లి అంటే ఓ దేవత, భూమాత' అని వివరించారు.
Also Read: RS Praveen Kumar: 'కొండా సురేఖకు మతిస్థిమితం లేదు.. ఆమె నేర చరిత్ర వరంగల్ ప్రజలకు తెలుసు'
'తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా ఉద్యమ ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశారు. తెలంగాణ తల్లి, బతుకమ్మ, ధూమ్ ధామ్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాయి. వందేమాతరం, జనగణమన స్వాతంత్రోద్యమం నుంచే పుట్టాయి. ప్రపంచ ఉద్యమాల్లో ఇలాంటి ప్రతిరూపాలు ఎన్నో వచ్చాయి' అని డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ గుర్తుచేశారు. 'రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని విద్వంసం చేస్తున్నారు. ఓ శాడిస్టు, సైకోపాత్‌లా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ తెలంగాణ అస్థిత్వాన్ని ధ్వంసం చేస్తున్నారు' అని మండిపడ్డారు.
'తెలంగాణ వ్యతిరేకులను సంతృప్తి పరిచేందుకు రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారు. అతడు తెలంగాణ మీదనే దాడి చేస్తున్నారు. విగ్రహాన్ని మార్చడానికి తెలంగాణ రేవంత్ తాత జాగీరా?' అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. 'తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ పాల్గొన లేదు కనుకే రేవంత్ రెడ్డి ఓ శాడిస్టులా వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డికి పాపం తగులుతుంది' అని తెలిపారు. వందేమాతరం, జనగణమనలను మారుస్తామంటే ఎవరైనా ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.
'రాహుల్, సోనియాల సిద్ధాంతాన్ని రేవంత్ పాటించడం లేదు. మోడీ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాడు. తెలంగాణ తల్లి విగ్రహ పరిశీలనకు రేవంత్ రెడ్డి ఒక్కరే వెళ్లారట.. ఎందుకు అందరిని సంప్రదించడం లేదు' అని దాసోజు సందేహం వ్యక్తం చేశారు. మోడీ అశోక చిహ్నంలోని సింహాల హావభావాలు మారిస్తే రాహుల్ గాంధీ వ్యతిరేకించారని గుర్తుచేశారు. ప్రతి పల్లెలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి.. ఎన్నింటిని రేవంత్ రెడ్డి విధ్వంసం చేస్తావ్ అని నిలదీశారు.
'తెలంగాణ తల్లికి కిరీటం ఉండదట.. దేవతకు కిరీటం ఉండకూడదా?' అని దాసోజు శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కిరీటం ధరిస్తున్నపుడు తెలంగాణ తల్లి ధరించకూడదా? అని నిలదీశారు. చరిత్ర ఆనవాళ్లతో ఆటలాడితే నిప్పుతో చెలగాటమే అని హెచ్చరించారు. మేధావులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రేవంత్ వికృత చేష్టలపై స్పందించాలని పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter