KTR Political Break: ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ముచ్చెమటలు పట్టిస్తున్నా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అకస్మాత్తుగా విరామం ప్రకటించారు. కొన్నాళ్లు విరామం తీసుకుంటానని ప్రకటించి రాజకీయ వర్గాల్లో సంచలనం రేపారు. 'కొన్ని రోజుల పాటు విరామం తీసుకుంటున్నా. నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను అంతగా మిస్ కారని భావిస్తున్నా' అని ట్వీట్ చేయడం కలకలం రేపింది. అసలు ఏమైంది? ఉన్నఫలంగా విరామం ఎందుకు తీసుకున్నారనేది చర్చనీయాంశంగా మారింది.
Also Read: RS Praveen Kumar: 'కొండా సురేఖకు మతిస్థిమితం లేదు.. ఆమె నేర చరిత్ర వరంగల్ ప్రజలకు తెలుసు'
కేసీఆర్ తనయుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన కేటీఆర్ ఉద్యమ సమయంలోనూ.. అధికారంలోనూ కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంగా కూడా కేటీఆర్ తనదైన శైలిలో దూకుడుగా వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిద్రపోనివ్వడం లేదు. ఆరు గ్యారంటీలు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నిలదీస్తూ కాంగ్రెస్ పార్టీని గడగడలాడిస్తూ కేటీఆర్ విజయవంతమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న ఈ సమయంలో అకస్మాత్తుగా విరామం తీసుకోవడం సంచలనం రేపింది.
Also Read: Deeksha Diwas: కేసీఆర్ హిమాలయమైతే.. రేవంత్ రెడ్డి ఆయన కాలిగోటికి సరిపోడు
కొంతకాలంగా కేటీఆర్ ఊపిరి తీసుకోలేనంత బిజీగా గడుపుతున్నారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతూ 'హైడ్రా, అదానీ, లగచర్ల' అంశాల్లో విజయవంతమయ్యాడు. దీక్షా దివాస్ కూడా అత్యంత విజయవంతం చేశాడు. దీంతో కొంత శారీరకంగా.. మానసికంగా అలసిపోయినట్లు భావించాడు. దీనికితోడు కుటుంబానికి కూడా దూరమవడంతో కొన్నాళ్లు కేటీఆర్ విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మధుమేహంతో బాధపడుతున్న కేటీఆర్ కొంత అస్వస్థతకు లోనవుతున్నారు. ఎక్కువ శ్రమిస్తే వెంటనే అలసిపోతాడు. ఈ క్రమంలో వరుస కార్యక్రమాలతో కేటీఆర్ కొంత విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు. తన కుమారుడు, కుటుంబంతో గడిపేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు తనకు రాజకీయంగా చేదోడుగా ఉన్న తన బావ, మాజీ మంత్రి హరీశ్ రావుతోపాటు తన సోదరి కల్వకుంట్ల కవిత కూడా రీ ఎంట్రీ ఇవ్వడంతో కొన్నాళ్లు కేటీఆర్ పక్కకు తొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 'రేవంత్ రెడ్డిని ఇక మీరు తగులుకోరి' అంటూ కవిత, హరీశ్ రావుకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. విదేశాల్లో ఉన్న తన కుమారుడు హిమాన్షు కోసం వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా కేటీఆర్ విశ్రాంతి కూడా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter