Hyderabad: స్కై వాక్ బ్రిడ్జిలతో రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుసా
హైదరాబాద్ మహానగరం కొత్త శోభ సంతరించుకోనుంది. ఆకాశవంతెనల నిర్మాణంతో రూపురేఖలు మార్చుకోనుంది. మెహిదీపట్నం, ఉప్పల్ రింగ్ రోడ్ జంక్షన్లు సరికొత్తగా మారనున్నాయి.
హైదరాబాద్ మహానగరం ( Hyderabad city ) కొత్త శోభ సంతరించుకోనుంది. ఆకాశవంతెనల నిర్మాణం ( Skywalk Bridges ) తో రూపురేఖలు మార్చుకోనుంది. మెహిదీపట్నం, ఉప్పల్ రింగ్ రోడ్ జంక్షన్లు సరికొత్తగా మారనున్నాయి.
తెలంగాణ ( Telangana ) రాజధాని హైదరాబాద్ కు కొత్త హంగులు చేరుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ( GHMC ) సరికొత్తగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. స్కై బ్రిడ్జెస్ నిర్మాణంతో కొత్త హంగులు తెచ్చిపెట్టేందుకు సిద్ధమైంది. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ప్రమాదాలు తగ్గించేందుకు, చిన్న చిన్న బస్టాండ్ల నిర్మాణాలతో ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించేందుకు కార్యాచరణ రూపొందించింది. ట్రాఫిక్ అధికంగా ఉండే మెహిదీపట్నం ( Mehdipatnam ) , ఉప్పల్ రింగ్ రోడ్ ( Uppal Ring Road ) జంక్షన్ల వద్ద స్కై వాక్ వంతెనల నిర్మాణంతో రూపురేఖలే మారిపోనున్నాయి. 60 కోట్ల ఖర్చుతో ప్రణాళిక సిద్ధమైంది.
ప్రస్తుతానికి మెహిదీపట్నం, ఉప్పల్ రింగ్ రోడ్ జంక్షన్లలో నిర్మించనున్న స్కై వాక్ వంతెనల్ని...భవిష్యత్‌లో దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లోనూ నిర్మించే ఆలోచన ఉంది. Also read: Pawan Kalyan: జనసేనానీ మెట్రో ప్రయాణం..
మెహిదీపట్నం ప్రాజెక్టు ఇలా ఉండనుంది
గుడి మల్కాపూర్ జంక్షన్ నుంచి మెహిదీపట్నం బస్టాండ్ మీదుగా పీవీ ఎక్స్‌ప్రెస్ వే ( PV Express Way )ఫ్లై ఓవర్ దిగువ నుంచి బస్టాండ్ వరకు ఈ స్కైవాక్ నిర్మాణం జరగనుంది. అదే విధంగా ఫ్లై ఓవర్ పై నుంచి బస్టాండ్‌లను కలుపుతూ ఒక ఆకృతి సరికొత్తగా ఉండేలా ప్లాన్ సిద్దమైంది. 380 మీటర్లు పొడవు, 3.6 మీటర్ల వెడల్పుతో 16 లిఫ్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు.
మరోవైపు రైతుబజార్ ( Rythu Bazar ) నుంచి మెహిదీపట్నం బస్టాండ్ వరకు మరో స్కైవాక్‌ను నిర్మించి పీవీ ఎక్స్‌ప్రెస్ వే కింది నుంచి వచ్చే స్కైవాక్‌కు కలుపుతారు. దాంతో గుడి మల్కాపూర్ నుంచి వచ్చే జనం, రైతు బజార్, ఆసిఫ్‌నగర్ నుంచి వచ్చే జనం వీటి పైనుంచే రాకపోకలు సాగిస్తారు.
బోర్డ్‌వాక్ వైపు కనెక్టివిటీని గ్లాస్ మాడ్యూల్స్ ద్వారా నిర్మిస్తారు. ఇందులో మెట్లు, లిఫ్ట్‌లు ఉంటాయి. దీనికి ఇరువైపులా 2.5 మీటర్ల ఎత్తులో స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేయనున్నారు. అటు రైతు బజార్ పక్కనున్న 2 వేల స్క్వేర్ మీటర్ల విస్తీర్ణలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో బస్ బే ఉండే విధంగా, ఎగువ అంతస్తులో వాణిజ్య సముదాయం నిర్మితం కానుంది.
[[{"fid":"196821","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"proposed sky walk bridge in Hyderabad","field_file_image_title_text[und][0][value]":"హైదరాబాద్ లో ప్రతిపాదిత ఆకాశవంతెన రూపం"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"proposed sky walk bridge in Hyderabad","field_file_image_title_text[und][0][value]":"హైదరాబాద్ లో ప్రతిపాదిత ఆకాశవంతెన రూపం"}},"link_text":false,"attributes":{"alt":"proposed sky walk bridge in Hyderabad","title":"హైదరాబాద్ లో ప్రతిపాదిత ఆకాశవంతెన రూపం","class":"media-element file-default","data-delta":"1"}}]]
ఉప్పల్ జంక్షన్ రూపురేఖలు
ఉప్పల్ జంక్షన్ ( Uppal Junction ) లో నాలుగు వైపులా లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, స్టెయిర్‌కేస్‌లను ఆరు చోట్ల ఏర్పాటు చేస్తారు. దీనికి అనుసంధానంగా 660 మీటర్ల పొడవు, 6.15 మీటర్ల ఎత్తు, నాలుగు మీటర్ల వెడల్పుతో వాక్‌వేను నిర్మించనున్నారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ మొదటి లెవల్‌కు అనుసంధానం చేస్తారు. అదేవిధంగా రామంతపూర్‌కు వెళ్లే మార్గంలో ఉన్న లిఫ్ట్‌ల నుంచి పైకి ఎక్కిన వ్యక్తి నేరుగా మెట్రో స్టేషన్‌లో అడుగు పెట్టవచ్చు. Also read: Gold Smuggling: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారు స్మగ్లర్ అరెస్ట్