Disha Movie - Disha Father Protest At RGV Office: హైదరాబాద్: వివాదస్పద దర్శకుడు రామ్ ‌గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) 2019 నవంబ‌ర్‌లో తెలంగాణ హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’ (Disha) అత్యాచార సంఘటనపై ‘దిశా ఎన్‌కౌంటర్’ (Disha Encounter) సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ను వర్మ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ‘దిశా ఎన్‌కౌంటర్’ సినిమాను ఆపాలంటూ.. దిశ తండ్రి (Disha Father) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం తాజాగా.. ఆదివారం ఉదయం దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి.. హైదరాబాద్‌లోని రామ్ గోపాల్ వర్మ కార్యాలయం ఎదుట ఈ సినిమాను నిషేదించాలంటూ.. మహిళా సంఘాలు, కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు కార్యాలయం బయటే వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. కుమార్తెను కోల్పోయి ఎంతో బాధ పడుతున్నామని.. ఈ తరుణంలోనే దిశా ఎన్‌కౌంటర్ మూవీ ట్రైలర్‌కు వస్తున్న కామెంట్లు తమను ఇంకా కుంగదీస్తున్నాయంటూ వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దిశ ఎన్‌కౌంటర్‌ సినిమాను బ్యాన్‌ చేయాలని ఆయన విన్నవించారు. Also read: Ram Gopal Varma: ‘దిశా ఎన్‌కౌంటర్’ సినిమాను ఆపండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలాఉంటే.. దిశా ఎన్‌కౌంటర్ సినిమా గురించి శనివారం క్లారిటీ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. తాజాగా దిశ ఎన్‌కౌంటర్ సినిమాను ఆపాలంటూ వస్తున్న డిమాండ్లపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. దిశా ఎన్‌కౌంటర్ చిత్రంపై వస్తున్న ఊహాగానాలకు సంబంధించి క్లారిటీ ఇస్తున్నానని.. ఈ సినిమా నిర్భయ అత్యాచారం నాటి నుంచి అనేక కేసుల ఆధారంగా నిర్మిస్తున్న ఒక కల్పిత కథ అని.. మరోసారి స్పష్టం చేస్తున్నానంటూ ఆయన ట్విట్ చేశారు.  



2019 నవంబ‌ర్‌లో తెలంగాణ హైదరాబాద్‌లో జరిగిన దిశ సంఘటన దేశ‌వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశ (disha) పై అత్యాచారం, హత్య, ఆ తర్వాత నిందితుల ఎన్‌కౌంటర్.. ఈ యథార్థ సంఘటనల ఆధారంగా ‘దిశా ఎన్‌కౌంటర్’ (DISHA ENCOUNTER ) సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో దిశ తండ్రి రెండు రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించి సినిమాను ఆపాలంటూ కోరారు. ప్రస్తుతం.. దిశ సంఘటన, ఆతర్వాత నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించడం సరికాదని కోరారు. అయితే.. సినిమాను ఆపాలని కేంద్ర ప్రభుత్వం, సెన్సార్‌ బోర్డుకు వినతి పత్రం అందించాలని కోర్టు దిశ తండ్రికి సూచించింది. ఈ క్రమంలోనే దిశ తండ్రి వర్మ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.  Also read: Ram Gopal Varma: ఆసక్తికరంగా దిశా ఎన్‌కౌంటర్ ట్రైలర్


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe