Ganesh Immersion 2022 : హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగే వేడుకల్లో వినాయక చవితి ముందుంటుంది. హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవానికి దేశ వ్యాప్తంగా గొప్ప పేరుంది. గ్రేటర్ పరిధిలో వాడవాడలా వెలిసిన బొజ్జ గణపయ్యలను శోభాయాత్రకు తీసుకొచ్చి గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. ప్రతి ఏటా హైదరాబాద్ లో జరిగే గణేష్ శోభాయాత్ర దేశంలోనే టాప్ లో నిలుస్తుంది. ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ లో జరిగే ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి చూడటానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. కోట్లాది మంది టీవీల్లో వీక్షిస్తారు. అయితే ఈ ఏడాది హైదరాబాద్ గణేష్ నిమజ్జనత్సవంపై వివాదం నెలకొంది. ఏ రోజున నిమజ్జనం నిర్వహిస్తున్నారనే విషయంలో భిన్న వాదనలు వస్తున్నాయి. శుక్రవారం జరుగుతుందని గణేష్ ఉత్సవ సమితి చెబుతుండగా.. కాదు శనివారం ఉంటుందనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. దీంతో హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవం ఎప్పుడన్న దానిపై భక్తుల్లో గందరగోళం నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ వినాయక శోభాయాత్ర, నిమజ్జనోత్సవంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది. 9వ తేదీ శుక్రవారమే గణేష్ నిమజ్జనం నిర్వహించాలని నిర్ణయించామని ప్రకటించింది. అనంత చతుర్దశి అయిన శుక్రవారమే నిమజ్జనోత్సవం  నిర్వహిస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధానకార్యదర్శి భగవంత్ రావు  చెప్పారు. కొంతమంది పోలీసులు 9వ తేదీ నిమజ్జనం లేదని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆ వార్తలను కొంతమంది వాట్సాప్‌‌ గ్రూపులో సర్క్యులేట్ చేస్తున్నారని.. కాని వాటిని ఎవరూ నమ్మవద్దని భగవంత్ రావు  తెలిపారు. కోర్ట్ ఉత్తర్వులు పాటిస్తూనే ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తేల్చి చెప్పారు.


ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు భగవంతరావు. గణేష్ నిమజ్జనం కోసం పాండ్స్ ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతుందని.. కాని  భక్తులను పాండ్స్ దగ్గరకు వెళ్ళనివ్వడం లేదని మండిపడ్డారు. వినాయక విగ్రహాలను చెత్తలో పడేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిమజ్జనానికి ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని పోలీసులు ఒత్తిడి చేయడం మానుకోవాలన్నారు. కేసీఆర్ సర్కార్ కు ఇతర పండుగల మీద ఉన్న ఆసక్తి గణేష్ ఉత్సవాల‌పై లేదని మండిపడ్డారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని కోర్టు ఎప్పుడు చెప్పలేదన్న భగవంతరావు.. 24 గంటల్లోనే నిమజ్జనం చేసిన వ్యర్థాలను తొలగిస్తున్నామని తెలిపారు.


గణేష్ శోభాయాత్రలో  ఎలాంటి అపశృతి జరిగినా కేసీఆర్ సర్కార్ బాధ్యత వహించాలని భగవంతరావు స్పష్టం చేశారు. జల్లికట్టు అంశం కోర్టులో ఉన్నా తమిళనాడు ప్రభుత్వమే ఏర్పాట్లు చేసిందని.. ఇక్కడ కూడా నిమజ్జనాలకు ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని  భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేసింది. గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే చేసి తీరుతామని.. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు లేకుంటే.. ఎక్కడి విగ్రహాలు అక్కడ పెట్టి నిరసన చేస్తామని భగవంత్ రావు హెచ్చరించారు.


Read Also: NIA RAIDS: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాల కలకలం.. చైతన్య మహిళా సంఘం నేతలే టార్గెట్


Read Also: Bhuma Family: మంచు మనోజ్ తో మౌనికారెడ్డి పెళ్లి! భూమా , మంచు కుటుంబాల్లో పెళ్లిలు.. గొడవలు.. విశేషాలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి