Bhuma Family: మంచు మనోజ్ తో మౌనికారెడ్డి పెళ్లి! భూమా , మంచు కుటుంబాల్లో పెళ్లిలు.. గొడవలు.. విశేషాలు ఇవే!

Bhuma Family: దివంగత భూమా నాగిరెడ్డి రెండో కూతురు, ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ సోదరి భూమా మౌనిక.. సిని హీరో మంచు మనోజ్ తో కలిసి హైదరాబాద్ సీతాఫల్ మండిలోని ఓ గణనాథుడి మండపానికి రావడం సంచలనంగా మారింది.

Written by - Srisailam | Last Updated : Sep 5, 2022, 11:02 AM IST
Bhuma Family: మంచు మనోజ్ తో మౌనికారెడ్డి పెళ్లి! భూమా , మంచు కుటుంబాల్లో పెళ్లిలు.. గొడవలు.. విశేషాలు ఇవే!

Bhuma Family: దివంగత భూమా నాగిరెడ్డి రెండో కూతురు, ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ సోదరి భూమా మౌనిక.. సిని హీరో మంచు మనోజ్ తో కలిసి హైదరాబాద్ సీతాఫల్ మండిలోని ఓ గణనాథుడి మండపానికి రావడం సంచలనంగా మారింది. కొంత కాలంగా మంచు మనోజ్ తో మౌనికారెడ్డి ప్రేమలో ఉన్నారని.. ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం సాగుతోంది. మంచు మనోజ్ కు గతంలో వివాహం జరిగినా.. విభేదాలు రావడంతో విడిపోయారు. మౌనికారెడ్డితో మనోజ్ ప్రేమ వ్యవహారంతో మంచు, భూమా ఫ్యామిలీల మధ్య బంధుత్వం కలగనుందని తెలుస్తోంది. తాజా పరిణామాలతో భూమా, మంచు కుటుంబంలో పెళ్లిళ్ల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

భూమా, మంచు ఫ్యామిలీకి సంబంధించి మరో విశేషం కూడా ఉంది. ఈ రెండు కుటుంబాలకు వైఎస్సార్ కుటుంబంతో బంధుత్వం ఉంది. అయితే విభేదాలతో భూమా కుటుంబం ఆ బంధాన్ని తెంచుకోగా.. మంచు ఫ్యామిలీతో మాత్రం కొనసాగుతోంది. దివంగత భూమా నాగిరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పేరున్న నేత. రాయలసీమలో ఓ వెలుగు వెలిగారు. ఆయన జీవితంలో ఎన్నో  మలుపులు కనిపిస్తాయి. భూమా నాగిరెడ్డికి కూడా ప్రేమ వివాహమే. కర్నూల్ జిల్లా కొత్తపల్లె గ్రామంలో జన్మించారు.నాగిరెడ్డి తండ్రి బాలిరెడ్డి ఫ్యాక్షన్ లీడర్ కావడంతో  తన కొడుకు ఫ్యాక్షన్ కు దూరంగా ఉంచాలని చెన్నైలో చదివించారు. మెడిసిన్ కోసం బెంగళూరులో ఉండగా.. నాగిరెడ్డి తండ్రి హత్యకు గురయ్యారు.దీంతో చదువు మానేసి సొంతూరు వచ్చేశారు. కర్నూల్ జిల్లాలో కీలక నేతగా ఉన్న ఎస్వీ సుబ్బారెడ్డి.. నాగిరెడ్డికి సమీప బంధువే. అతని కూతురు శోభ, నాగిరెడ్డి ప్రేమించుకున్నారు. మేనత్త కూతురే అయినా వాళ్ల పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో నాగిరెడ్డి, శోభ ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

భూమా నాగిరెడ్డికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కూతురు అఖిలప్రియను వైఎస్సార్ కు కుటుంబానికి పంపించారు. అఖిలప్రియకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బావమరిది, ప్రస్తుతం కమలాపూర్ ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి కొడుకుతో పెళ్లి జరిగింది. వైఎస్సార్, భూమా కుటుంబాల మధ్య అనుంబంధం కారణంగా ఈ సంబంధం కుదిరింది. అయితే  కొన్ని రోజులకే విభేదాలు తారాస్థాయికి చేరుకోవటంతో విడాకులు తీసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో శోభ మరణం తర్వాత అఖిలప్రియ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అయ్యారు. మంత్రిగా ఉన్నప్పుడే వ్యాపారవేత్త భార్గవరామ్‌ ను ప్రేమించారు. భార్గవ్ ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావును కూతురును పెళ్లి చేసుకుని.. తర్వాత విడిపోయారు.  అఖిలప్రియ, భార్గవ్ రామ్ 2018, ఆగస్టు  29న ఆళ్లగడ్డలో పెళ్లి చేసుకున్నారు.

ఇక మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణుది లవ్ మ్యారేజీనే. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ సుధీర్ రెడ్డి కుమార్తె వెరోనికాను విష్ణు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వెరోనికా కాస్టూమ్ డిజైనర్. మంచు విష్ణు నటించిన ఢీ సినిమాకు వెరోనికా కాస్టూమ్ డిజైనర్ గా పని చేసింది. ఈ సమయంలోప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. మంచు విష్ణు వివాహం వెరోనికా రెడ్డితో మార్చి 1, 2009న జరిగింది.మంచు మనోజ్ కు ప్రముఖ వ్యాపారేత్త కూతురు ప్రణితితో పెళ్లి జరిగింది. అయితే 2019లో ప్రణితికి విడాకులు ఇచ్చారు మనోజ్.మౌనికారెడ్డికి గతంలోనే పెళ్లి జరిగింది. భర్తతో విభేదాలు రావడంకో ఆమె కూడా విడాకులు ఇచ్చేసింది.  భూమా, మంచు కుటుంబాల మొదటి నుంచి మంచి స్నేహబంధం ఉంది. భూమా దంపతుల మరణం తర్వాత బంధం మరింత బలపడిందని అంటున్నారు. మంచు మనోజ్‌ ఆ కుటుంబానికి అండగా ఉన్నారని అంటున్నారు. ఇదే వీరిద్దరి మధ్య ప్రేమకు దారి తీసిందని అంటున్నారు. ప్రస్తుతం మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. కొంతకాలంగా చిత్ర పరిశ్రమకూ దూరంగా ఉన్న మనోజ్‌.. పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నఅహం బ్రహ్మస్మి సినిమాలో నటిస్తున్నారు.

Read Also: Gold Price Today: మగువలకు శుభవార్త.. హైదరాబాద్‌లో నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?

Read Also: IND vs PAK: నిరాశపరిచిన భారత బౌలర్లు.. ఉత్కంఠ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News