హైదరాబాద్‌ : తెలంగాణలో ఇవాళ రాష్ట్రంలో 1,567 కరోనావైరస్ పాజిటివ్‌ కేసులు ( Coronavirus ) నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారిన సంఖ్య 50,826 కి చేరుకోగా.. కరోనా కారణంగా ఇవాళ తొమ్మిది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 447కి ( COVID-19 patients death toll ) చేరింది. నేడు 1,661 మంది కరోనావైరస్‌ నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య మొత్తం 39,327 గా ఉంది. మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసులలో ఇది 77.3 శాతం. ప్రస్తుతం రాష్ట్రంలో 11,052 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం వరకు చేసిన 13,367 కొవిడ్‌-19 పరీక్షలతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు 3,22,326 మందికి కరోనా టెస్టులు ( COVID-19 tests ) చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

( Also read: Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు ) 


తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ( Health bulletin ) పేర్కొన్న వివరాల ప్రకారం.. గురువారం కొత్తగా నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసులలో అత్యధికంగా జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 662 కేసులు ఉండగా ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 213, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 75, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 62, మహబూబ్‌నగర్‌లో 61, నాగర్‌కర్నూల్‌‌లో 51, నల్లగొండలో 44, నిజామాబాద్‌, సూర్యాపేట జిల్లాల్లో 39, కరీంనగర్‌లో 38, మేడ్చల్‌లో 33, సంగారెడ్డిలో 32, మెదక్‌లో 27, జయశంకర్‌ భూపాలపల్లిలో 25, వరంగల్ రూరల్‌, జనగామ జిల్లాల్లో 22 చొప్పున కేసులు నమోదయ్యాయి. 


( Also read: Health tips: వేపాకుతో ఇన్ని లాభాలు, ప్రయోజనాలా ? )


అలాగే మహబూబాబాద్‌ జిల్లాలో 18, కామారెడ్డి, ములుగు, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 17 చొప్పున, జగిత్యాలలో 14, ఖమ్మంలో 10, సిద్దిపేటలో 9,వికారాబాద్‌లో 5,యాదాద్రి భువనగిరి, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో 4 కేసులు చొప్పున, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల జిల్లాల్లో రెండు చొప్పున నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఒకటి చొప్పున కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ( Also read: WFH option: మహిళలకు ఇదో చక్కటి అవకాశం )