WFH option: మహిళలకు ఇదో చక్కటి అవకాశం

వర్క్ ఫ్రమ్ హోమ్ ( Work from home ) సౌకర్యం అనేది మహిళలకు ఓ చక్కటి అవకాశం లాంటిది అని అన్నారు సేల్స్‌ఫోర్స్ ఇండియా సీఈఓ అరుంధతి భట్టాచార్య. ఇప్పటివరకు ఇంటికే పరిమితమైన మహిళలు సైతం తిరిగి తమ కెరీర్‌పై దృష్టిసారించేందుకు ఇదే సరైన సమయం అని అన్నారామె.

Last Updated : Jul 23, 2020, 08:56 PM IST
WFH option: మహిళలకు ఇదో చక్కటి అవకాశం

న్యూ ఢిల్లీ: వర్క్ ఫ్రమ్ హోమ్ ( Work from home ) సౌకర్యం అనేది మహిళలకు ఓ చక్కటి అవకాశం లాంటిది అని అన్నారు సేల్స్‌ఫోర్స్ ఇండియా సీఈఓ అరుంధతి భట్టాచార్య. కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) నివారణ చర్యల్లో భాగంగా అనేక సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం ( WFH ) కల్పిస్తున్నందున.. ఉద్యోగం చేసేవారిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు. అంతేకాకుండా ఇప్పటివరకు ఇంటికే పరిమితమైన మహిళలు సైతం తిరిగి తమ కెరీర్‌పై దృష్టిసారించేందుకు ఇదే సరైన సమయం అని అన్నారామె. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2020 ( Global Fintech Fest 2020 ) వేదికగా మాట్లాడుతూ అరుంధతి భట్టాచార్య ఈ వ్యాఖ్యలు చేశారు. ( Also read: Work from home: ఐటి ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ )

ఇటీవల కాలంలో భారత్‌లో ఉపాధి రంగాల్లో మహిళల భాగస్వామ్యం తగ్గిపోతుందని.. సుశిక్షితులైన మహిళలు ఇంటికే పరిమితం కాకూడదని చెబుతూ.. '' గృహిణిగా ఓవైపు ఇంట్లో బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు నచ్చిన రంగంలో రాణించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం ఉపయోగం పడుతుంది'' అని అరుంధతి భట్టాచార్య ( Arundhati Bhattacharya ) అభిప్రాయపడ్డారు. ( Also read: Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు ) 

గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉద్యోగానికి దూరమైన మహిళలు తిరిగి ఉద్యోగం చేరాలంటే కొన్ని సందర్భాల్లో పలు సవాళ్లు ఎదురవుతాయని.. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ రాకతో మహిళలు సైతం తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు చక్కటి అవకాశం లభించింది అని చెప్పుకొచ్చారామె. ( Also read: Health tips: వేపాకుతో ఇన్ని లాభాలు, ప్రయోజనాలా ? )

Trending News