Telangana: 50 వేలకు చేరువలో కరోనా కేసులు
హైదరాబాద్ : తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు( Coronavirus ) 50 వేలకు సమీపంలోకి చేరుకున్నాయి. బుధవారం రాత్రి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 15,882 మందికి కరోనా పరీక్షలు ( COVID-19 tests ) చేయగా.. 1,554 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
హైదరాబాద్ : తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు( Coronavirus ) 50 వేలకు సమీపంలోకి చేరుకున్నాయి. బుధవారం రాత్రి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 15,882 మందికి కరోనా పరీక్షలు ( COVID-19 tests ) చేయగా.. 1,554 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో ఎప్పటిలాగే జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే అత్యధికంగా 842 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 49,259 కి చేరింది. ఇవాళ 1,281 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. ఇప్పటివరకు మొత్తం 37,666 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,155 కరోనావైరస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ( Also read: COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్‌పై మరో కుట్రకు తెరతీసిన చైనా : అమెరికా )
ఇవాళ తెలంగాణలో గుర్తించిన కరోనా పాజిటివ్ కేసులలో జిల్లాల వారీగా గుర్తించిన కేసుల విషయానికొస్తే ( District wise cases ).. రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్ జిల్లాలో 96, కరీంనగర్ జిల్లాలో 73, నల్లగొండ జిల్లాలో 51, వరంగల్ అర్బన్ జిల్లాలో 38, వరంగల్ రూరల్ జిల్లాలో 36, నిజామాబాద్‌లో 28, మెదక్‌లో 25, సంగారెడ్డిలో 24, పెద్దపెల్లిలో 23 కేసులు నమోదయ్యాయి. అలాగే ఖమ్మం, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 22 చొప్పున, వనపర్తిలో 21, రాజన్న సిరిసిల్లలో 18, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 14, మహబూబాబాద్ జిల్లాలో 11, ఆదిలాబాద్, ములుగు, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 8 కేసుల చొప్పున కేసులు నిర్ధారించారు. ( Also read: Health tips: వేపాకుతో ఇన్ని లాభాలు, ప్రయోజనాలా ? )
జోగులాంబ గద్వాలలో 5, జగిత్యాల, మంచిర్యాలలో 3 చొప్పున, ఆసిఫాబాద్, సిద్దిపేట జిల్లాల్లో 2 కేసుల చొప్పున, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, వికారాబాద్ జిల్లాల్లో ఒకటి చొప్పున కరోనావైరస్ పాజిటివ్ కేసులను నిర్ధారించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 2,93,077 మందికి కొవిడ్-19 పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇవాళ కరోనావైరస్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 438కి ( COVID-19 deaths ) చేరింది. ( Also read: Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )