వైద్యులపై మరోసారి దాడి.. ఆందోళనలో జూడాలు..
రాష్ట్రంలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న విపత్కర పరిస్థితుల్లో మరో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రిలోని కరోనా ఐసోలేషన్ వార్డులో పీజీ డాక్టర్లపై దాడి జరిగింది.
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న విపత్కర పరిస్థితుల్లో మరో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రిలోని కరోనా ఐసోలేషన్ వార్డులో పీజీ డాక్టర్లపై దాడి జరిగింది. మంగళవారం ఉస్మానియా ఆసుపత్రిలో రెండు పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Read Also: illicit liquor: డ్రోన్ల సహాయంతో అక్రమ మద్యం పట్టివేత
అయితే, కరోనా బాధితులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఐసోలేషన్ వార్డులోని ఇద్దరికి పాజిటివ్ రావడంతో అదే వార్డులో ఉన్న కరోనా అనుమానితుడు అన్వర్ అలీ తండ్రి వైద్యులపై దాడి చేశాడు. కరోనా పాజిటివ్ కేసులు వస్తున్న నేపథ్యంలో తన కొడుకును ఇంటికి తీసుకుపోతానని వైద్యులతో తండ్రి గొడవకు దిగడం ఆందోళన కలిగించిందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు వచ్చేవరకు ఇక్కడే ఉండాలని వైద్యులు చెప్పడంతో పేషంట్ తండ్రి, డాక్టర్ల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుందని, ఇలా వరుస దాడుల నేపథ్యంలో వైద్యులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కాగా ఈ ఘర్షణలో పీజీ డాక్టర్లపై దాడి చేసిన వారు వైద్యులను క్షమాపణ కోరినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Bikiniలో అందాల భామ హాట్ ఫొటోలు