illicit liquor: డ్రోన్ల సహాయంతో అక్రమ మద్యం పట్టివేత

లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడటంతో మద్యం ప్రియుల జిహ్వ రుచి తీర్చేందుకు కొందరు దురాశపరులు అక్రమ మద్యం వ్యాపారానికి తెరతీస్తున్నారు. జన సంచారం లేని చోట, అడవుల్లో అక్రమంగా మద్యం తయారుచేస్తూనో లేక నిల్వ చేస్తూనో.. అక్కడి నుంచి మద్యం ప్రియులకు లిక్కర్ సరఫరా చేస్తున్నారు.

Last Updated : Apr 14, 2020, 05:36 PM IST
illicit liquor: డ్రోన్ల సహాయంతో అక్రమ మద్యం పట్టివేత

వాయనాడ్: లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడటంతో మద్యం ప్రియుల జిహ్వ రుచి తీర్చేందుకు కొందరు దురాశపరులు అక్రమ మద్యం వ్యాపారానికి తెరతీస్తున్నారు. జన సంచారం లేని చోట, అడవుల్లో అక్రమంగా మద్యం తయారుచేస్తూనో లేక నిల్వ చేస్తూనో.. అక్కడి నుంచి మద్యం ప్రియులకు లిక్కర్ సరఫరా చేస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత మద్యం లభించకపోవడంతో మద్యం ప్రియులు పిచ్చిపట్టినట్టుగా ప్రవర్తించినటువంటి అనేక ఘటనలు వెలుగులోకొచ్చాయి. ముఖ్యంగా కేరళలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా చోటుచేసుకున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 

Also read : Flights: అప్పటివరకు విమానాల రాకపోకలకు బ్రేక్

ఈ నేపథ్యంలోనే గుట్టుచప్పుడు కాకుండా అక్రమ మద్యం వ్యాపారం జరుగుతోందని పసిగట్టిన కేరళలోని వాయనాడ్ ఎక్సైజ్ పోలీసులు.. డ్రోన్ల సహాయంతో మద్యం నిల్వలు ఉన్న ప్రాంతాల్ని గుర్తించారు. అనంతరం అక్రమ మద్యంను స్వాధీనం చేసుకుని దానిని పారబోయడంతో పాటు అక్రమ మద్యం విక్రయిస్తున్న పలువురిని అరెస్ట్ చేశారు. వయనాడ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎన్ రాజశేఖరన్ ఆ వివరాలను మీడియాకు వెల్లడిస్తూ విడుదల చేసిన ఫోటోలివి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News