Medipally Sathyam: దీపావళి పండుగ రోజే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు డబుల్ షాక్.. బెదిరింపులు.. ప్రమాదం
Medipally Sathyam Received Threat Call: పండుగ పూట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సత్యం డబుల్ షాక్ తగిలింది. ఒకరు బెదిరింపు ఫోన్ కాల్ చేయగా.. మరో సంఘటనలో ఆయన ప్రమాదం బారినపడ్డారు.
Threat Call To MLA: దీపావళి పండుగ రోజే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు షాక్‌ల మీద షాక్‌లు తగిలాయి. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడగా.. ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ప్రమాదం బారినపడ్డారు. ప్రమాదం నుంచి రెప్పపాటు క్షణంలో తప్పించుకున్నారు. దీంతో పండుగ రోజు అతడు, అతడి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భార్యను కోల్పోయిన అతడికి దీపావళి రోజు ఈ సంఘటనలు చోటుచేసుకోవడంతో అతడి అనుచరులు, కుటుంబసభ్యుల్లో ఆందోళ వ్యక్తమవుతోంది. అతడే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.
Also Read: Aghori: అఘోరీని ఇంట్లోకి రానివ్వని కుటుంబీకులు.. నగ్నంగా వస్తే ఎలా రానిస్తాం?
తెలంగాణలోని చొప్పదండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మేడిపల్లి సత్యం గెలిచిన విషయం తెలిసిందే. అతడి సతీమణి ఇటీవల బలవన్మరణానికి పాల్పడడంతో సత్యం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర ఆవేదనలో ఉన్నారు. రాజకీయంగా కూడా అంత యాక్టివ్‌గా లేని ఆయనకు తాజాగా బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. రూ.20 లక్షలు ఇవ్వాలని.. ఇవ్వకపోతే చంపేస్తామని హెచ్చరించారు.
Also Read: Telangana DA: తెలంగాణ 3.64 శాతం డీఏ పెంపు ఉత్తర్వులు విడుదల.. ఎప్పటి నుంచి వర్తింపు అంటే..?
తనకు రూ.20 లక్షలు ఇవ్వాలని బెదిరింపులు ఫోన్ కాల్స్ వచ్చాయని మేడిపల్లి సత్యం తెలిపారు. అడిగినన్నీ డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని కూడా హెచ్చరించినట్లు సత్యం వివరించారు. ఈనెల 28వ తేదీన తనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని.. అప్పటి నుంచి బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. 'చంపేసి నా పిల్లలను అనాథలుగా మారుస్తాం. నీ డాటా మొత్తం మా దగ్గర ఉంది. రాజకీయంగా సమాధి చేస్తాం' అని బెదిరించినట్లు ఎమ్మెల్యే సత్యం వెల్లడించారు. అయితే బెదిరింపులపై త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
దీపావళి పండుగ రోజే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రమాదం నుంచి బయటపడ్డారు. కరీంనగర్‌లో జరిగిన ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించే సమయంలో ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. దీంతో కార్యకర్తలు, నాయకులతోపాటు ఎమ్మెల్యే సత్యం కూడా కిందపడ్డారు. అయితే వెంటనే తేరుకుని లేవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.