Dubbaka Bypoll Campaign: నేటితో దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి తెర
Dubbaka Bypoll Campaign Ends Today | దుబ్బాక ఉపఎన్నికల మాటల పోరుకు నేడు తెర పడనుంది. నేటి సాయంత్రం 5 గంటలకు దుబ్బాక ఎన్నికల ప్రచారపర్వం ముగియనుంది. నవంబర్ 3వ తేదీన దుబ్బాక ఉప ఎన్నికల జరగనుందని తెలిసిందే.
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికల మాటల పోరుకు నేడు తెర పడనుంది. నేటి సాయంత్రం 5 గంటలకు దుబ్బాక ఎన్నికల ప్రచారపర్వం (Dubbaka Bypoll Schedule) ముగియనుంది. దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిచెందడంతో ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఎన్నిక ప్రక్రియలో జాప్యం జరిగింది. నవంబర్ 3వ తేదీన దుబ్బాక ఉప ఎన్నిక (Dubbaka Bypoll on November 3) జరగనుందని తెలిసిందే.
దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత రెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ తరఫున రఘునందన్ రావు, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రధానంగా వీరి మధ్యే గట్టి పోటీ ఎదురయ్యేలా కనిపిస్తోంది. గెలుపే లక్ష్యంగా ప్రచార హోరును టీఆర్ఎస్ కీలకనేత, మంత్రి హరీష్ రావు.. సుజాత రెడ్డి బాధ్యతలు భుజాన వేసుకున్నారు.
ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయలు జరగకుండా చూసేందుకు సిద్దిపేట జిల్లాలో గత నెలరోజుల నుంచి పోలీస్ యాక్ట్-1861ను అమలు చేస్తున్నారు. నేడు ప్రచారం ముగియగానే స్థానికేతర నేతలు, కార్యకర్తలు, వారి ప్రాంతానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుండగా.. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు ప్రక్రియ, విజేతను ప్రకటిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe