Solipeta Sujatha: మాజీ ఎమ్మెల్యే భార్యకే దుబ్బాక టీఆర్ఎస్ టికెట్

దుబ్బాక (Dubbaka Bypoll) ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్ధిని ఖరారు చేసింది. తమ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపెట సుజాత (Solipeta Sujatha) పేరును టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ఖరారు చేశారు.

Last Updated : Oct 6, 2020, 08:55 AM IST
  • నవంబర్ నెలలో దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నిక
  • దుబ్బాక ఉప ఎన్నికలపై కసరత్తు ప్రారంభించిన అధికార టీఆర్ఎస్ పార్టీ
  • దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకే టీఆర్ఎస్ టికెట్
Solipeta Sujatha: మాజీ ఎమ్మెల్యే భార్యకే  దుబ్బాక టీఆర్ఎస్ టికెట్

హైదరాబాద్: దుబ్బాక (Dubbaka) అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్ధిని ఖరారు చేసింది. తమ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపెట సుజాత (Solipeta Sujatha) పేరును టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ఖరారు చేశారు. జర్నలిస్టుగా రెండున్నర దశాబ్దాల పాటు సేవలందించిన రామలింగారెడ్డి.. అనంతరం కేసీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు.

తెలంగాణ ఉద్యమంలో సోలిపేట రామలింగారెడ్డి (Solipeta Ramalinga Reddy) క్రియాశీల పాత్ర పోషించారని, పార్టీ, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కష్టపడ్డారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. అనారోగ్యంతో మరణించిన రామలింగారెడ్డి స్థానంలో ఆయన భార్య సుజాతకు టికెట్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి కొనసాగాలంటే మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుటుంబసభ్యులే ఉండాలని భావించి సోలిపేట సుజాతకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఆమెకు కుమారుడు సోలిపేట సతీష్ రెడ్డి, కుమార్తె ఉదయశ్రీ ఉన్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News