Musi Project: మూసీ నది సరిహద్దు ప్రాంత పరిరక్షణ కోసం కూల్చివేతల చేపడుతున్న రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని.. పేదలకు తాము అండగా ఉంటామని ఎంపీ ఈటల రాజేందర్‌ భరోసా ఇచ్చారు. మూసీ నది పరివాహాక ప్రాంతాల ప్రజలు కూల్చివేతలపై ఎలాంటి భయం ఉంచుకోవద్దని చెప్పారు. మీకు బీజేపీ అండగా ఉంటుందని ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ తప్పిదాలు.. వైఫల్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Ragging: ర్యాగింగ్‌ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌.. విచారణకు ఆదేశం


 


హైదరాబాద్‌లోని చైతన్యపురి డివిజన్ పరిధిలోని ఫణిగిరి కాలనీలో శనివారం బస్తీనిద్ర చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం మరుసటి రోజు తెల్లవారుజామున మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ న్యూ మారుతి నగర్, సత్యనగర్, ఫణిగిరి కాలనీల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీల వాసులందరికీ  ధైర్యంగా ఉండాలని.. మీకు మేము అండగా ఉన్నామని చెప్పడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. 

Also Read: Cm Revanth Reddy: సొంతూరిపై రేవంత్ ఫోకస్‌.. అభివృద్ధిలో తగ్గేదేలే!


 


ఈ సందర్భంగా ఫణిగిరి కాలనీ  సాయిబాబా గుడి ఆవరణలో మూసీ బాధితులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. మూసీ నది సుందరీకరణ పేరుతో పేద ప్రజలను మూడు నెలల నుంచి నిద్రాహారాలు లేకుండా చేసిందని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఇల్లు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం చెల్లించి వారికి హామీ ఇస్తే అభివృద్ధికి అందరం సహకరిస్తామని చెప్పారు. 


ప్రజలు ఇండ్లు కోల్పోతామని ఆవేదనతో బ్రేన్ స్టాక్, హార్ట్ స్ట్రోక్.. పలు వ్యాధుల బారిన పడి ఉన్నారని అలాంటి బాధిత కుటుంబాలకు బీజేపీ అండగా ఉంటుందని ఎంపీ ఈటల రాజేందర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో మూసీ పరివాహకం అంటే చైతన్యపురి డివిజన్ ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపిస్తుందని వివరించారు. ఇక్కడ గజం ధర రూ.లక్షలు పలకడం వలన ప్రభుత్వం వీటిపై ఎక్కువగా దృష్టి సారించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు ఏమాత్రం అవగాహన లేదని తల ఒక మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ బాధిత కుటుంబాలకు  నష్టపరిహారం చెల్లించి మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter