Telangana Ragging Incidents: జూనియర్ సీనియర్ల మధ్య ఏర్పడిన విభేదాలు వివాదానికి దారి తీసింది. ర్యాగింగ్ భూతం బహిర్గతమైంది. మొన్న మహబూబ్‌నగర్.. తాజాగా ఖమ్మంలో ర్యాగింగ్ సంఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపాయి. వరుసగా చోటుచేసుకుంటున్న ర్యాగింగ్ సంఘటనలపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ర్యాగింగ్ దురాగతాలపై కఠిన చర్యలకు ఆదేశించింది. ర్యాగింగ్‌తో భవిష్యత్ పాడు చేసుకోవద్దని ప్రభుత్వం సూచించింది.
Also Read: Cm Revanth Reddy: సొంతూరిపై రేవంత్ ఫోకస్.. అభివృద్ధిలో తగ్గేదేలే!
మహబూబ్‌నగర్, ఖమ్మం ర్యాగింగ్ ఘటనలపై మంత్రి దామోదర రాజ నర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాగింగ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ర్యాగింగ్ పేరిట భవిష్యత్ పాడుచేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. మెడికల్ కళాశాలల్లో ర్యాగింగ్ ఘటనలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఉన్నతాధికారులతో మంత్రి ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Also Read: KT Rama Rao: లగచర్ల గ్రామాన్ని రేవంత్ రెడ్డి సమాధి చేస్తుండు: కేటీఆర్
ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు. అన్ని కాలేజీల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ర్యాగింగ్ నిరోధానికి పోలీస్ డిపార్ట్‌మెంట్ సహకారం తీసుకోవాలన్నారు. ర్యాగింగ్ వల్ల విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం పడకుండా చూడాలని ఉన్నతాధికారులకు మంత్రి చెప్పారు. తమ జూనియర్లతో సీనియర్ స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా ఉండాలి తప్పితే.. ర్యాగింగ్ పేరిట వారిని భయాందోళనకు గురి చేయొద్దని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter