Delhi Excise Policy scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వేగం పెంచిన ఈడి.. నేడు 35 చోట్ల ఈడి సోదాలు
Delhi Excise Policy scam Updates: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నేడు ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 35 చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. శుక్రవారం ఉదయాన్నే ఈడి సోదాలు మొదలుపెట్టింది.
Delhi Excise Policy scam Updates: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల్లో ఒకరైన బిజినెస్‌మేన్ సమీర్ మహేంద్రు ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. సమీర్ మహేంద్రుని విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ కేసులో పంజాబ్, ఆంధ్రప్రదేశ్ తోనూ సంబంధాలు ఉన్నట్టు గుర్తించారని.. ఈ కారణంగానే నేడు మరోసారి ఢిల్లీతో పాటు పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించినట్టు సమాచారం అందుతోంది.
జీ బిజినెస్ ప్రచురించిన ఒక వార్తా కథనం ప్రకారం.. ఇప్పటికే హైదరాబాద్‌లో ఈ కేసుతో ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు బిజినెస్‌మేన్ల నివాసాలు, వారి కార్యాలయాల్లో పలుమార్లు సోదాలు జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. తాజాగా నిర్వహిస్తున్న సోదాల్లో డాక్యుమెంట్స్, డిజిటల్ ఎవిడెన్స్ సేకరణపైనే ఎక్కువ దృష్టిసారించినట్టు తెలుస్తోంది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో నేరుగా ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కోకాపేటలోని అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసంతో పాటు అభిషేక్ రావు డైరెక్టర్‌గా ఉన్న హైదరాబాద్ మాదాపూర్‌లోని అనూస్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్‌లోనూ ఈడి గతంలోనే సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేటి సోదాలతో కలిపి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటివరకు దాదాపు 100 కు పైగా ప్రాంతాల్లో దాడులు జరిపినట్టు సమాచారం.
ఇదిలావుంటే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లందరూ టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసుతో టీఆర్ఎస్ నేతలకు సైతం సంబంధం ఉండకపోదు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు సైతం ఇదే విషయాన్ని బలంగా వాదిస్తూ తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న వారి లింక్స్ అన్నీ టీఆర్ఎస్ నేతల వరకు వచ్చి ఆగిపోతుండటంతో తీగలాగితే డొంక కదిలినట్టు భవిష్యత్తులో ఇంకెలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో, ఇంకెవరెవరి పేర్లు బయటికి వస్తాయో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చినట్టు ప్రకటించి (TRS to BRS) జాతీయ రాజకీయాల్లో అడుగుపెడుతున్నామన్న ఆనందంలో ఆ పార్టీ నేతలు ఉండగా.. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణలో వేగం పెంచి ఇంకోవైపు నుండి నరుక్కొస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
Also Read : TARGET TRS : టీఆర్ఎస్ ముఖ్యనేతల ఫోన్లు స్విచ్చాఫ్.. వెంటాడుతున్న ఈడీ.. దసరా తర్వాత ఏం జరగబోతోంది?
Also Read : Delhi Liquor Scam: ఢిల్లీలో వెన్నమనేని ఈడీ విచారణ.. లిక్కర్ స్కాంలో తొలి అరెస్ట్ ఎవరో..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి