Tollywood Drugs Case: ఈడీ, ఎక్సైజ్ మధ్య వార్ తగ్గినట్లేనా..? ఇక విచారణేనా..?
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ, ఎక్సైజ్ మధ్య వార్ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈక్రమంలోనే ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్.. ఈడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేశారు. మార్చి 21న ఈడీకి 828 పేజీలతో వివరాలు ఇచ్చామన్నారు. కోర్టులకు సమర్పించిన డిజిటల్ సాక్ష్యాల వివరాలను కూడా ఇచ్చామని స్పష్టం చేశారు.
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ, ఎక్సైజ్ మధ్య వార్ కొనసాగుతోంది. ఎక్సైజ్ శాఖ అధికారులు సరిగా స్పందించడం లేదంటూ తెలంగాణ హైకోర్టును ఈడీ ఆశ్రయించింది. దీనిపై కోర్టు సైతం సీరియస్ అయ్యింది. తక్షణమే అన్ని వివరాలు అందించాలని స్పష్టం చేసింది. ఐనా ఎక్సైజ్ శాఖ నుంచి స్పందన లేకపోవడంతో న్యాయ స్థానంలో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను ఈడీ అధికారులు వేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. తాజాగా కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.
ఈక్రమంలోనే ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్.. ఈడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేశారు. మార్చి 21న ఈడీకి 828 పేజీలతో వివరాలు ఇచ్చామన్నారు. కోర్టులకు సమర్పించిన డిజిటల్ సాక్ష్యాల వివరాలను కూడా ఇచ్చామని స్పష్టం చేశారు. కెల్విన్ కేసులో సేకరించిన వాట్సాప్ స్క్రీన్ షాట్లు సైతం అప్పగించామని కౌంటర్ దాఖలులో తెలిపారు. నిందితుల కాల్ డేటా రికార్డులను దర్యాప్తు అధికారులు సేకరించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
కెల్విన్ కేసులో సిట్ సేకరించిన 12 మంది కాల్‌డేటా, వీడియో రికార్డులను ఈడీకి ఇచ్చామన్నారు ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించాలన్న ఉద్దేశం తమకు లేదని తేల్చి చెప్పారు. కొన్ని కారణాలతో ఈడీకి సమాచారం ఇవ్వడం కొంత ఆలస్యమైందని కౌంటర్ దాఖలులో పేర్కొన్నారు. ఇందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నామన్నారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు సహకరిస్తామని స్పష్టం చేశారు. కోర్టు ధిక్కరణ కేసును కొట్టి వేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈకేసులో వాదనలకు మరింత సమయం ఇవ్వాలని కోర్టును ఈడీ కోరింది. ఎక్సైజ్ శాఖ ఇచ్చిన వివరాలు హైకోర్టు ఆదేశాల మేరకు ఉన్నాయో లేదో పరిశీలించేందుకు సమయం కావాలని తెలిపింది. దీనిపై వేసవి సెలవుల తర్వాత విచారిస్తామని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది.
2017లో డ్రగ్స్ కేసు(DRUGS CASE) తీవ్ర కలకలం రేపింది. రంగంలోకి దిగిన ఎక్సైజ్ శాఖ ..పలువురు సినీ తారలను విచారించింది. వారి నుంచి రక్తం నమూనాలను సైతం సేకరించింది. కొందరికి క్లీన్ చిట్ కూడా వచ్చింది. ఈకేసులో మనీలాండరింగ్ జరిగిందని తేలడంతో ఈడీ రంగంలోకి దిగింది. పలువురు సినీ తారలను మళ్లీ విచారించారు. నగదు బదిలీ ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈకేసును లోతుగా విచారించేందుకు మరిన్ని వివరాలు ఇవ్వాలని ఎక్సైజ్ శాఖను ఈడీ కోరుతోంది. త్వరలో మరోసారి సినీ ప్రముఖులను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి రావడంతో సినీ ఇండస్ట్రీ షేక్ అవుతోంది. మళ్లీ ఎవరెవరికీ నోటీసులు వస్తాయో అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే సినీ హీరోలు, హీరోయిన్లను
ఎక్సైజ్, ఈడీ అధికారులు విచారించారు. కోర్టు ధిక్కారణ పిటిషన్ కేసు కొలిక్కి వచ్చిన తర్వాత విచారణ షురూ కానున్నట్లు తెలుస్తోంది.
Also read:AP Teachers Protest: సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల ఆందోళనలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.