BJP Joinings:  తెలంగాణలో ప్రస్తుతం ఆపరేషన్ ఆకర్ష్ నడుస్తోంది. ఇతర పార్టీల నేతలను ఆకర్షించి తమ పార్టీలో చేర్చుకునేలా అధికార, విపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. చేరికల కోసమే బీజేపీ, కాంగ్రెస్ లు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి. సీఎం కేసీఆర్ ను ఓడించడమే తమ జీవిత లక్ష్యమంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు బీజేపీ చేరికల కమిటీ బాధ్యతలు అప్పగించింది. పార్టీ పెద్దల డైరెక్షన్ లోనే ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తున్నారు ఈటల రాజేందర్. రహస్యంగా మంత్రాంగం నడిపిస్తున్నారు. కొంత కాలంగా బీజేపీ నేతలు తమ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని చెబుతున్నా ఎవరూ చేరలేదు. అయితే ఆషాడమాసం కావడంతో చేరికలు లేవని.. ఆగస్టులో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని వారం రోజుల క్రితం బండి సంజయ్, ఈటల రాజేందర్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఢిల్లీకి వెళ్లారు ఈటల రాజేందర్. అతనితో పాటు మాజీ మంత్రి డీకే అరుణ కూడా హస్తినకు వెళ్లారు. వీళ్లిద్దరు బీజేపీ పెద్దలను కలవనున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరబోయే జాబితాతో రాజేందర్ ఢిల్లీకి వెళ్లారని తెలుస్తోంది. ఆ లిస్టును హైకమాండ్ కు చూపించి చర్చిస్తారని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్ జాబితాలో ఉన్న నేతల పేర్లు ఇవేనంటూ బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.. ఆ జాబితాలోని పేర్లు ఇవిగో..


మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
రాష్ట్ర సరిహద్దు నియోజకవర్గానికి చెందిన ఓ టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే
ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ
ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి
మహబూబ్ నగర్ జిల్లాకు చెంది మాజీ మంత్రి
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ తరపున టీవీ డిబేట్లలో పాల్గొనే ఇద్దరు కీలక నేతలు
వరంగల్ జిల్లాకు చెందిన కన్నెబోయిన రాజయ్య యాదవ్
పెద్దపల్లి జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ గట్టిముక్కల సురేశ్ రెడ్డి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ  ఎమెల్యే , మాజీ ఎమ్మెల్సీ
కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారనే ప్రచారం సాగుతోంది


Read also: Nethanna Bima: చేనేతకు పెద్దపీట వేస్తున్నాం..7న అద్భుత పథకం తీసుకొస్తున్నామన్న కేటీఆర్..


Read also: IND Playing 11 vs WI: స్టార్ ప్లేయర్ ఔట్.. సెంచరీ హీరో ఇన్! వెస్టిండీస్‌తో రెండో టీ20కి భారత జట్టు ఇదే  



 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook