Patancheruvu BRS Politics: సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరులో బీఆర్‌ఎస్ పార్టీ కష్టకాలం ఎదుర్కోంటోంది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇటీవల అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం పార్టీలో జాయిన్‌ అయ్యారు. అయితే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు పఠాన్‌ చెరులో బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఇంచార్జ్‌ను నియమించలేదు. అయితే పఠాన్‌ చెరులో కారు పార్టీకి కీలకంగా కొందరు లీడర్లు ఉన్నప్పటికీ వారికి బాధ్యతలు ఇచ్చేందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. దాంతో పార్టీని నడిపించే నాయకుడు లేక క్యాడర్ మొత్తం పక్కచూపులు చూస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pawan kalyan: బీహార్ రాజకీయాలను షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం.. అసలేం జరిగిందంటే..?  


ఇక 2009లో నియోజకవర్గాల పునర్ విభజనలో పఠాన్‌ చెరు నియోజకవర్గం కొత్తగా ఏర్పాటైంది. తొలిసారి పఠాన్ చెరులో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. అప్పట్లో పఠాన్ చెరు నియోజకవర్గం నుంచి నందీశ్వర్ గౌడ్‌ విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో తెలంగాణ రావడంతో పఠాన్‌ చెరు బీఆర్‌ఎస్ వశమైంది. అక్కడ లోకల్‌ లీడర్‌గా మంచి గుర్తింపు ఉన్న గూడెం మహిపాల్‌ రెడ్డి గులాబీ బాస్‌ కేసీఆర్ టికెట్‌ కేటాయించారు. ఆ ఎన్నికల్లో గూడెం మహిపాల్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. 


అనంతరం 2019 ఎన్నికల్లో మరోసారి గెలిచారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గూడెం విజయం సాధించి హ్యాట్రిక్‌ నమోదు చేశారు. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ అధికారం కోల్పోవడంతో ఆయన అధికార పార్టీలో  చేరిపోయారు. అయితే గూడెం మహిపాల్‌ ఉన్నట్టుండి అధికార పార్టీలో చేరడంతో బీఆర్‌ఎస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలినట్టయింది. అయితే పార్టీలో సీనియర్‌ లీడర్లు చాలా మంది ఉన్నప్పటికీ నియోజకవర్గంలో క్యాడర్‌కు దిశానిర్ధేశం చేసే లీడర్‌ లేకుండా పోయారట. ప్రస్తుతం పఠాన్ చెరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, ఆదర్శ్‌ రెడ్డి, బాల్‌ రెడ్డి లాంటి లీడర్లు ఉన్నారు. కానీ వీరికి నియోజకవర్గ ఇంచార్జ్‌ పదవి ఇచ్చే ఆలోచనలో పార్టీ హైకమాండ్‌ లేదని తెలుస్తోంది. 


మరోవైపు పఠాన్ చెరు నియోజకవర్గంలో గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారక పార్టీలో పరిస్థితులు మరింత డీలా పడ్డాయట. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు క్యాడర్‌లో జోష్‌ నింపే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందట.. పార్టీకి కొత్త ఇంచార్జ్‌ వస్తే గానీ పార్టీ గాడిలో పడే చాన్స్ లేదని కార్యకర్తలు చెబుతున్నారట. ఇదిలా ఉంటే పార్టీ హైకమాండ్‌ ఆలోచన మాత్రం మరోలా ఉందని నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్‌ఎస్‌ పార్టీ భావిస్తోంది. ఆ నియోజకవర్గాల్లో ఎన్నికలు వచ్చేలోపు ఇంచార్జ్‌ను నియమిస్తే.. వారికే టికెట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇంచార్జ్‌ల నియామకం విషయంలో పార్టీ పెద్దలు ఆచీతూచీ అడుగులు వేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. అందుకే కొత్త ఇంచార్జ్‌ల నియామకం విషయంలో ఆలస్యం చేస్తున్నారని చెబుతున్నారు. 


మొత్తంగా పఠాన్‌ చెరు నియోజకవర్గంలో ఇంచార్జ్‌ నియామకం ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదని అంటున్నారు. అయితే కొత్త ఇంచార్జ్‌ వస్తేనే పార్టీ క్యాడర్‌లో కొత్త జోష్‌ వస్తుందని నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పఠాన్ చెరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కొత్త ఇంచార్జ్‌గా ఎవరికి నియమిస్తారనేది ఆసక్తి కరంగా మారింది. చూడాలి మరి ఉప ఎన్నికల వరకు కొత్త ఇంచార్జ్‌ను నియమించకుండా.. పార్టీ పెద్దలు ఇలాగే నాన్చుతారా..లేదంటే అంతలోపే కొత్త ఇంచార్జ్‌ను నియమిస్తారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే..! 


Also Read: Pawan Kalyan : హోం మంత్రి పదవి నుంచి అనితను తప్పుకోమన్న పవన్, ఇక హోం మంత్రిగా పవన్ ఖాయమా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.