Etela Rajender: భవిష్యత్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు.. ఓటమి తరువాత ఈటల రియాక్షన్ ఇదే..!
Ex Minister Etela Rajender Press Meet: తెలంగాణ బీజేపీ ఓటు శాతం పెరిగిందని.. ఒక సీటు నుంచి 8 సీట్లకు తమ బలం పెరిగిందన్నారు. భవిష్యత్‌లో అధికారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. మోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాబోతుందన్నారు.
Ex Minister Etela Rajender Press Meet: తెలంగాణలో బీజేపీ ఓట్లు డబుల్ అయ్యాయని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఒక సీటు నుంచి 8 సీట్లకు పెరిగాయని.. భవిష్యత్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో ఓటమి తరువాత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి ఈటల తొలిసారి ప్రెస్‌మీట్ నిర్వహించారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో మిగతా పార్టీలు డబ్బులు పంచినా.. ప్రలోభాలకు గురి చేసినా.. కార్యకర్తల కృషివల్ల బీజేపీకి ఇంత పెద్దఎత్తున ఓట్లు వచ్చాయన్నారు. కష్టపడిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు కూడా బీజేపీని ఆదరించినందుకు ధన్యవాదాలు చెబుతున్నామన్నారు.
2018 ఎన్నికల్లో 6 శాతం ఓట్లు ఒక సీటు రాగా.. మరో మూడు సీట్లలో రెండో స్థానంలో బీజేపీ నిలిచింది. ఈసారి 8 సీట్లు గెలుచుకుంది. 19 నియోజకవర్గాల్లో రెండో స్థానంలో ఉంది. 46 స్థానాల్లో డిపాజిట్ దక్కించుకుంది. 15 శాతంతో.. 36 లక్షల ఓట్లతో బీజేపీ మీద విశ్వాసం ఉంచారు. మోదీ గారు వాగ్ధాటితో గెలుస్తున్నారనే భావన శుద్ధతప్పు. భారతదేశ ప్రజలకు భద్రత, భరోసా ఇచ్చారు. ప్రపంచ చిత్రపటం మీద భారతదేశ గొప్పతనాన్ని చాటారు. దేశం అంతా.. అన్నీ భాషల, అన్నీ ప్రాంతాల, అన్నీ వర్గాల వారికి మా ప్రధాని అని చెప్పుకునేలా చేశారు. మోదీ హయాంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. 2014లో ఆర్థిక రంగంలో 11 స్థానంలో ఉంటే.. ఈరోజు 5వ స్థానానికి ఎదిగింది. 3వ స్థానానికి ఎదిగేలా మోదీ గారు చర్యలు తీసుకుంటున్నారు.
డబుల్ డిజిట్ ఉన్న ద్రవ్యోల్బణంను సింగిల్ డిజిట్‌కు తగ్గించగలిగారు. కరోనా సమయంలో ప్రజలకు ధైర్యం ఇచ్చిన వ్యక్తి మోదీ. దేశానికి ఉచితంగా వాక్సిన్ అందించారు. నేపాల్, బంగ్లాదేశ్ ఆర్థికంగా చితికిపోతుంటే అండగా ఉన్న దేశం భారత్. ఖలిస్థాన్, కాశ్మీర్ ప్రత్యేక దేశాలు కావాలన్నా స్థాయి నుంచి.. పాకిస్థాన్‌లో ఉన్న బలిచిస్తాన్, POK కూడా భారత దేశంలో కలుస్తామని చెప్తున్నారు. మోదీ విజన్ ఏంటో అర్థం చేసుకోవాలి.. మోదీ గారు వచ్చాక శ్రీనగర్‌లో బుల్లెట్ గాయాలు అయిన జవాన్ల సంఖ్య తగ్గిందని ఆర్మీ డాక్టర్స్ చెప్తున్నారు. మన దేశం వైపు చూడాలంటేనే పక్క దేశాలు జంకుతున్నాయి.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మిజోరం, తెలంగాణలో ఎన్నికలు జరిగితే దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ లాంటి వాళ్లు ఈవీఎం టాంపరింగ్ అని మాట్లాడడం వారి విజ్ఞతకే వదిలివేసున్నా.. 2019లో 303 సీట్లు గెలిచారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్ల గెలుపు దిశగా ప్రయాణిస్తున్నారు. ఏ దేశానికి మేము తక్కువ కాదు అని మోదీ నిరూపించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో యుద్దాన్ని ఆపి మన పిల్లలని సురక్షితంగా తీసుకొని వచ్చిన మహనీయుడు నరేంద్ర మోదీ గారు. ఆఫ్రికన్ దేశాలకు అండగా నిలవాలని జీ-20 సదస్సులో చెప్పారు. అయోధ్య విషయంలో ఎవరినీ నొప్పించకుండా న్యాయబద్దంగా గుడి కట్టించి దేశ ప్రజలకు అంకితం చేయబోతున్నారు. చంద్రయాన్ -3 విజయవంతం చేశారు. అవినీతి కంపులేని పాలన అందిస్తున్న మోదీ గారు పార్లమెంట్ ఎన్నికల్లో స్వీప్ చేయబోతున్నారు.." అని ఈటల రాజేందర్ తెలిపారు.
రఘునందన్ రావు మాట్లాడుతూ.. కడియం శ్రీహరి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం అని అన్నారు. ఆయన మాటలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కడియం కామెంట్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఎంఐఎంతో అంటకాగే పార్టీతో మా పార్టీ ఉండదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కార్యకర్తలు తప్పుడు పోస్టులు పెట్టవద్దని.. సంయమనం పాటించాలని సూచించారు.
Also Read: WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?
Also Read: Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి