Harish Rao Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయటపడుతోందని.. ఆయన డబుల్ స్టాండర్డ్ నిన్న ఒక్క మాట నేడు ఒక్క మాట రేపు ఒక్క మాట మాట్లాడుతాడని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రెండు నాలుకుల మనుషులు ఉంటారని.. వారి గురించి పెద్దగా పట్టించుకోరని, కానీ చాలా ప్రమాదకరమన్నారు. డబుల్ స్టాండర్డ్‌లో రేవంత్ రెడ్డి పీహెచ్‌డీ చేశారని.. మూడో స్టాండర్డ్‌ని చెప్పగల నేర్పరి అని ఎద్దేవా చేశారు. ఒక్క పార్టీలో ఉంటూ మరో పార్టీ నాయకురాలను బలిదేవత అంటాడు.. తరవాత అదే పార్టీలోకి వచ్చి దేవత అంటాడని విమర్శించారు. మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని గతంలో అడిగి.. ఇప్పుడు మొత్త ఎగ్గొట్టాడని ఫైర్ అయ్యారు. దొంగే దొంగ అన్నట్టు ఉందని.. రైతుబంధుని ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కేసీఆర్‌ మీద నెడుతున్నాడని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Viral Video: హనుమంతుడి ఆలయంలో గదతో వానరం.. ఆనందంతో పొంగిపోతున్న భక్తులు.. వీడియో ఇదిగో..  


"నిజమైన రైతుబంధు కేసీఆర్. రైతుబంధు, రైతు బీమా  రూ.80 వేల కోట్ల ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ పేద బిడ్డ దసరా పండగ పూట పాత చీర కట్టుకోవద్దని.. చేనేతలకు ఉపాధి కలిపించినట్లు ఉంటుందని చీరలు ఇచ్చే వారు. పండుగ పూట ఆడ పిల్లలను మోసం చేశారు. రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించే కోకో కోల్ కంపెనీ కూడా కాళశ్వరంలో భాగమే. సోనియా గాంధీని బలి దేవత అన్నాడు. మూడు రంగుల పార్టీలోకి వచ్చిన తరవాత దేవత అంటున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడు. 


శిలాఫలకలపై ఫోటోలు పెట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఎక్కడ చూసినా నిర్భంధాలు.. లగచర్లను టెర్రరిస్ట్‌లాగా చేసినావు. సంధ్య గారు వెళితే అక్కడ వారిని అరెస్ట్ చేశావు. ప్రశ్నస్తే దాడులు, ప్రజాస్వామ్య ఖునీ చేస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నక్సలైట్స్ ఉంటే బాగుండు అన్నాడు. ఇప్పుడు ఎన్‌కౌంటర్లు చేస్తున్నాడు. ఇది మూడో ఎన్‌కౌంటర్. లెఫ్ట్ పార్టీ వాళ్లు వెళితే ఫార్మా నోటిఫికేషన్ రద్దు చేయాలని వెళితే ఎవరు చెప్పారు అని అన్నాడు. ఇప్పుడు ఫార్మా నోటిఫికేషన్ రద్దు చేశాడు. 


రేవంత్ రెడ్డి అపరిచితుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రజినీ.. ఇప్పుడు గజినీ అన్నట్లు ఉంది వ్యవహారం. మోసం చేయడం మాకు అలవాటు.. మోసపోవడం ప్రజలకు అలవాటు అన్నాడు. రేవంత్ రెడ్డి మోసాన్ని ప్రజలకు చూపించాలనేది నా ప్రయత్నం. ప్రజలు చాలా కోల్పోయారు." అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 


Also Read: SVBC Chairman: SVBC చైర్మన్ రేసులో ఆ ముగ్గురు.. ? ఎవరికీ దక్కేనో..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.