సబిత కుమారుడు కాంగ్రెస్కు గుడ్ బై ; ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటున్న కార్తీక్ రెడ్డి ?
కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడత క్రమ క్రమంగా పెరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సబిత కుమారుడు కార్తీక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేసినట్లు తెలిసింది. తనకు టికెట్ కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. శంషాబాద్ బేగం ఇండియా గార్డెన్స్ లో కార్యకర్తలతో సమావేశమైన కార్తీక్ రెడ్డి భవిష్యత్త్ కార్యచరణపై చర్చించారు. రాజేంద్రనగర్ టికెట్ ను టీడీపీకి కేటాయిస్తూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కార్తీక్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు
టీడీపీ ఖాతాలో రాజేంద్రనగర్ ...
వాస్తవానికి రాజేంద్రనగర్ స్థానం మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించారు. దీంతో ఈ స్థానంపై ఆశపెట్టుకున్న కార్తీక్ రెడ్డికి భంగుపాటు ఎదురైంది. చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో ఓటమి అనంతరం ఆయన రాజేందర్ నగర్ స్థానంపై గత కొన్నేళ్లుగా దృష్టిపెడుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయకు రాజేందర్ నగర్ ఇన్ ఛార్జ్ గా కాంగ్రెస్ పార్టీ నియమించింది. గత ఆరు నెలల నుంచి కార్తీక్ రెడ్డి రాజేందనగ్ లో ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అయితే మహాకూటమి పొత్తులో భాగంగా టికెట్ టీడీపీకి కేటాయించడంతో కార్తీక్ రెడ్డి ఆశలు అడియాశలయ్యాయి. ఈ నేపథ్యంలో కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
టికెట్ అమ్ముకున్నారని ఆరోపణ
రాజీనామా అంశంపై కార్తీక్ రెడ్డి స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న తమ కుటుంబానికి పార్టీ తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. రాజేందర్ నగర్ లో గత ఆరు నెలలుగా తాను ప్రచారం చేసుకుంటున్నారని.. అయితే ఈ స్థానాన్ని ఏమాత్రం బలంలేని టీడీపీకి కేటాయించడం తనకు ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. కేసీఆర్ తో పాటు స్టానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ కుమ్మకై టికెట్లు అమ్ముకుంటన్నారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. ఒక కుటుంబానికి రెండు టికెట్లు ఎందుకు ఇవ్వకుడదని కాంగ్రెస్ నేతలనున ఆయన ప్రశ్నించారు. కొందరు నేతల కుటుంబానికి రెండు టికెట్లు కేటాయించిన కాంగ్రెస్ ..దశాబ్దాలపాటు కాంగ్రెస్ జెండా మోసిన తమకు టికెట్ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఏదిఏమైనప్పటికీ తాను రాజేంద్రనగర్ నుంచి స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు. కార్తీక్ రెడ్డి నిర్ణయంతో రాజేంద్రనగర్ రాజకీయాలు ఆసక్తి మారాయి.