Warangal Politics: ఆరూరి అలక.. కేసీఆర్ మెలిక!
Aruri Ramesh: వరంగల్ జిల్లాలో ఓ నేత కమలం పార్టీకి గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నారా..! మరోసారి కారు ఎక్కాలని ఎదురుచూస్తున్నారా..! గులాబీ బాస్ ఓకే అనగానే గులాబీ కండువా కప్పుకోబోతున్నారా..! ఇంతకీ ఆయన కమలం వదిలేని కారు ఎందుకు ఎక్కాలని అనుకుంటున్నారు..! ఆయన పార్టీ మారాలనే నిర్ణయం వెనుక ఎవరున్నారు..
Aruri Ramesh: గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీ నుంచి కమలం పార్టీ లోకి జంప్ కొట్టారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్.. వర్ధన్నపేట నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరూరి రమేష్.. 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వర్ధన్నపేటలో కేఆర్ నాగరాజు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత వరంగల్ ఎంపీ టికెట్ ఆశించినా ఆరూరి రమేష్‌కు బీఆర్‌ఎస్ హైకమాండ్ ఝలక్ ఇచ్చింది. వరంగల్ ఎంపీ టికెట్‌ను నిరాకరించడంతో.. ఆయన కమలం కండువా కప్పుకున్నారు. అనంతరం బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటిచేసిన ఆరూరి రమేష్.. కడియం కావ్య చేతిలో పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఆరూరి.. ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరుతారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఆరూరి రమేష్.. కొద్దిరోజులుగా కమలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఓరుగల్లులో స్థానిక కమలం పార్టీ నేతలతో కూడా అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజులుగా బీజేపీలో ఆయనకు ఆశించిన గౌరవం దక్కడం లేదని తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన తిరిగి సొంతగూటికి చేరుకోవాలని అనుచరులతో మంతనాలు జరుపుతున్నారట. అయితే ఆయన పార్టీ మారుతున్నారన్న సమచారంతో కమలం పెద్దలు.. ఇటీవల మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి పంపించారు. ఇలా చేస్తే అయినా యాక్టివ్ అవుతారని భావించారు. కానీ ప్రస్తుతం ఆరూరిలో ఏమాత్రం మార్పు లేనట్టు తెలుస్తోంది. ఆరూరి రమేష్ కషాయం వదిలేసి.. గులాబీ పార్టీలో చేరాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. వర్ధన్న పేటలో ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీకి ఇంచార్జ్‌ను నియమించలేదు.. ఆరూరి రమేష్ పార్టీ మారిన తరువాత వర్ధన్నపేట బిఆరెస్ పార్టీలో అతని స్థానం భర్తీ చేయలేదు.. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌లో చేరితేనే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం..
ఇక బీఆర్‌ఎస్ పార్టీలో దశాబ్ధం పాటు జర్నీ చేసిన ఆరూరికి మాజీ మంత్రి హరీశ్ రావుతో సత్ససంబంధాలు ఉన్నాయి. గతంలో హరీశ్ రావు ఏదీచెప్పినా ఆరూరీ తూచా తప్పకుండా పాటించేవారని చెబుతున్నారు. ఆ సాన్నిహిత్యంతోనే మరోసారి హరీశ్ రావుకు ఆరూరి టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఆరూరి రాకకు హరీశ్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. పార్టీ అధినేత కేసీఆర్‌తో కలిశాక చేరుతానని ఆరూరి కోరినట్టు సమాచారం. అందుకే గులాబీ బాస్ అపాయింట్‌మెంట్ కోసం ఆరూరి రమేష్ ఎదురుచూస్తున్నారట. ఒకవేళ ఈ వారంలో రోజుల్లో కేసీఆర్ ఓకే చెబితే ఆరూరి చేరిక ఖాయమని అనుచరులు చెబుతున్నారు.
మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేలోపు ఆరూరి రమేష్ గులాబీ కండువా కప్పుకోవాలని యోచిస్తున్నారట. మరోసారి గులాబీ బాస్ బాటలో నడిచి స్థానికంలో సత్తా చాటాలని ఆరూరి లెక్కలు వేసుకుంటున్నారట. చూడాలి మరి ఆరూరి రాకకు గులాబీ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో.. స్థానిక సంస్థల తర్వాతే చేరమని చెబుతారో అని తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే..!
Also Read: BRS Maha Dharna: మనుకోటలో రచ్చరచ్చ.. కేటీఆర్‌పై గులాబీ లీడర్ల గుస్సా! !
Also Read: TELANGANA BJP: ఆపరేషన్ తెలంగాణ.. బీజేపీ కొత్తప్లాన్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.