TELANGANA BJP: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది..! మహాయుతి సర్కార్ రెండోసారి మహాపీఠం దక్కించుకోవడంతో.. నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అని పార్టీలో నేతలు జోరుగా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని కమలనాథులు లెక్కలు వేస్తున్నారట. తాజాగా తెలంగాణలోని బార్డర్ జిల్లాలో కమలం వికాసం వెల్లి విరిసింది. దాంతో తెలంగాణలోనూ కమలం పార్టీ ప్రభావం ఉంటుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారట. అందుకే తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం వికాసం కనిపించింది. ఆ పార్టీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ 8 సీట్లు గెలిచారు. ఈ ఎన్నికల్లో కమలం పార్టీకి దాదాపు 37 శాతం ఓట్లు పడ్డాయి. కానీ ఆ తర్వాత పార్టీ పరిస్ధితి డీలా పడింది. ఇందుకు కారణం లేకపోలేదు. పార్టీ చీఫ్‌గా ఉన్న కిషన్ రెడ్డి సరిగ్గా సమయం కేటాయించకపోవడం, నేతలంతా పాత- కొత్త అంటూ రెండు వర్గాలుగా విడిపోవడంతో పార్టీకి మరింత డ్యామేజ్ జరిగింది. ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రానికి ఎక్కువ సమయం కేటాయించడం లేదు. అయితే కొద్దిరోజులుగా పార్టీకి కొత్త ప్రెసిడెంట్‌ను నియమిస్తారని టాక్ వినిపించింది. కానీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం.. రాష్ట్ర చీఫ్ పదవి ఎవరికి ఇవ్వాలో పార్టీ పెద్దలు కూడా ఓ అంచనాకు రాలేకపోయారు.
ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో నేతల్లో మరోసారి ఆశలు చిగురించాయి. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దు జిల్లాలోనూ బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడంతో.. కాస్త కష్టపడితే పార్టీకి విజయం పక్కా అని అంచనా వేస్తున్నారట. ఇప్పటికే రాష్ట్రంలో రేవంత్ సర్కార్‌పై బీజేపీ నేతలు అటాక్ మొదలు పెట్టారు. ఓ వైపు బండి సంజయ్, మరోవైపు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ పోరాటం చేస్తున్నారు. హైదరాబాద్‌లో హైడ్రా, మూసీ కూల్చివేతల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఆరు గ్యారెంటీల విషయంలోనూ కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగడుతున్నారు. ఇదే ఊపును కంటిన్యూ చేయాలని పార్టీ పెద్దలు సైతం వీరికి డైరెక్షన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
మొత్తంగా రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లోనూ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీకి 40 కి పైగా కార్పొరేటర్లు గెలిచారు. వచ్చే ఎన్నికల్లోనూ అంతకుమించి సీట్లను గెలుచుకోవాలని భావిస్తున్నారట. మరోవైపు వచ్చే ఏడాది పార్టీకి కొత్త ప్రెసిడెంట్‌ను నియమించే అవకాశం ఉంది. ఇవన్నీ పార్టీకి కొత్త జోష్ తీసుకువస్తుందని అనుకుంటున్నారట. మొత్తంగా బీజేపీకి వచ్చే ఎన్నికల్లో పవర్ దక్కుతుందో.. లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిదే..!
Also Read: CONGRESS PARTY: మా అడ్డాలో మీ పెత్తనమా.. కామారెడ్డి ఎమ్మెల్యేలు రివర్స్!
Also Read: YCP PARTY: ధర్మాన అస్త్రసన్యాసం.. కొడుకు జనసేనలోకి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.