Hyderabad Drugs Case: రాడిసన్ బ్లూ హోటల్ లైసెన్స్ రద్దు చేసిన ఎక్సైజ్ శాఖ...
Hyderabad Drugs Case: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూసిన రాడిసన్ బ్లూ హోటల్ లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Hyderabad Drugs Case: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూసిన రాడిసన్ బ్లూ హోటల్ లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లైసెన్స్, లిక్కర్ లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 24 గంటలపాటు మద్యం సప్లైకి రాడిసన్ హోటల్ ఎక్సైజ్ శాఖ నుంచి గతంలో అనుమతులు పొందింది. ఇందుకోసం ఎక్సైజ్ శాఖకు రూ.56 లక్షలు చెల్లించి 2B బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో అనుమతులు పొందింది.
ఆదివారం (ఏప్రిల్ 3) తెల్లవారుజామున ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌పై దాడులు చేసిన పోలీసులు అక్కడ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 150 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సినీ, రాజకీయ, వీఐపీల పిల్లలు ఉండటంతో ఈ వ్యవహారం సంచలనం రేపింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా డాటర్ నిహారిక కొణిదెల, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ తదితరుల పేర్లు బయటకొచ్చాయి. నిహారిక తరుపున స్పందించిన ఆమె తండ్రి నాగబాబు, తన కొడుకు తరుపున స్పందించిన అంజన్ కుమార్ యాదవ్ డ్రగ్స్ ఆరోపణలను కొట్టిపారేశారు. రాహుల్ సిప్లిగంజ్ కూడా తాను డ్రగ్స్ తీసుకోలేదని.. ఏ టెస్టుకైనా సిద్ధమేనని ప్రకటించాడు.
తాజాగా ఈ వ్యవహారంలో నటి కుషిత పేరు కూడా బయటకు రాగా... తనపై వచ్చిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. పబ్‌కి వెళ్లింది నిజమే కానీ తాను డ్రగ్స్ తీసుకోలేదన్నారు. తాను వెళ్లిన కాసేపటికే పబ్‌పై పోలీసుల రైడ్ జరిగిందన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్‌లో నలుగురి పేర్లను చేర్చారు. ఇందులో A1గా అనిల్, A2గా అభిషేక్, A3గా అర్జున్, A4గా కిరణ్ రాజ్ ఉన్నారు. ప్రస్తుతం అనిల్, అభిషేక్ చంచల్ గూడ జైల్లో రిమాండులో ఉండగా అర్జున్, కిరణ్ పరారీలో ఉన్నారు.
Also Read: Hyderabad: మందు బాబులకు గుడ్ న్యూస్... బార్ షాప్స్ టైమింగ్స్ పొడగించిన సర్కార్
Hyderabad Drugs Case: డ్రగ్స్ కేసులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు... ఎఫ్ఐఆర్‌లో ఆ నలుగురి పేర్లు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook