Shobha Naidu Passed Away: ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ శోభానాయుడు కన్నుమూత
Kuchipudi dancer Shobha Naidu Dies :| ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ శోభానాయుడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున శోభానాయుడు (Shobha Naidu) తుదిశ్వాస విడిచారని సమాచారం.
ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి శోభానాయుడు కన్నుమూశారు (Shobha Naidu Passed Away). కొన్ని రోజుల కిందట ఇంట్లో జారిపడటంతో తలకు బలమైన గాయమైంది. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆమె గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున శోభానాయుడు తుదిశ్వాస విడిచారని (Shobha Naidu Dies) సమాచారం. అయితే చికిత్స పొందుతున్న క్రమంలో ఆమె కరోనా వైరస్ బారిన పడినట్లు తెలిసింది. ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ శోభానాయుడు మృతి (Shobha Naidu Death News) సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
- Also Read : Hyderabad Rains: ఇళ్లు కూలి 8మంది మృతి
గత కొన్ని రోజులుగా తన భార్య శోభానాయుడుకు వెంటిలేటర్‌పై కరోనా ట్రీట్‌మెంట్ అందిస్తున్నారని ఆమె భర్త, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అర్జునరావు వెల్లడించారు. కూచిపూడిలో ఆమె చేసిన ప్రదర్శనలు, సేవలకుగానూ శోభనాయుడు పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. వెంపటి చినసత్యం శిష్యురాలిగా కూచిపూడి అకాడమీని స్థాపించారు శోభానాయుడు. గత నాలుగు దశాబ్దాలుగా కూచిపూడి తరగతులు నిర్వహించి నాట్యంలో శిక్షణ ఇస్తున్నారు. పలు దేశాలలో ఆమె శిష్యులున్నారు.
Also Read : Kavitha: క్వారంటైన్‌లోకి ఎమ్మెల్సీ కవిత
శోభానాయుడు పొందిన అవార్డులు, సత్కారాలు (Shobha Naidu Awards and Achievements)
- 2001 - పద్మశ్రీ పురస్కారం
- 1982 - మద్రాసులోని కృష్ణ గానసభ నుండి నృత్య చూడామణి
- 1998- ఎన్టీఆర్ పురస్కారం
- 1990 - సంగీత నాటక అకాడమీ పురస్కారం
- 2011 - తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు
- ఏపీ ప్రభుత్వం నుంచి హంస అవార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe