NTR Centenary: ఫిలిం అండ్ టెలివిజన్ కౌన్సిల్ అఫ్ ఇండియా దివంగత ఎన్‌టీఆర్ శత జయంతి ఉత్సవాల ముగింపుని పురస్కరించుకొని తెలుగు సినిమా వేదిక సౌజన్యంతో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ లెజెండరీ నేషనల్ అవార్డ్స్ కర్టెన్ రైజర్ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. మంత్రి క్యాంపు ఆఫీస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు మనం సైతం వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ అతిధిగా విచ్చేసారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎఫ్ టి పీ సి అధ్యక్షులు చైతన్య జంగా, తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు వీస్ వర్మ పాకలపాటి, అవార్డ్స్ కమిటీ సభ్యులు విశ్వనాధ్, రాంచంద్, నాగార్జున రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్న ఈ ఆవిష్కరణకు గ్లోబల్ మోడల్ అవార్డు విన్నర్ ఐశ్వర్య రాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


విశ్వవిఖ్యాత నటులు ఎన్టీఆర్ శతజయంతి ముగింపు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనుండడం పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఎనిమిది రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన ఈ సినీ సామాజిక పురస్కార సంబరం ఈ నెల 28న ప్రసాద్ ల్యాబ్ ఆడిటోరియంలో జరగనుంది. ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారని చైతన్య జంగా -  వీస్ వర్మ పాకలపాటి పేర్కొన్నారు!