హైదరాబాద్ నగరంలోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం (Fire accident at Annapurna Studios) సంభవించింది. శుక్రవారం ఉదయం స్టూడియోలో మంటలు (Annapurna Studios Fire accident) చెలరేగాయి. దాంతో కొంత సమయానికే అన్నపూర్ణ స్టూడియో (Annapurna Studios)లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. షూటింగ్ కోసం వేసిన సెట్‌లో షార్ట్ స‌ర్క్యూట్ జ‌ర‌గ‌డంతో ప్ర‌మాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కాగా, సినీ నటుడు, టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌కు యాజమానిగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమాలతో పాటు సీరియల్స్ షూటింగ్ జరుగుతుంది. రియాలిటీ షో, ప్రోగ్రామ్స్ షూటింగ్ సైతం ఇక్కడ జరుపుతుంటారని తెలిసిందే. దివంగత మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు ఈ స్టూడియోను నిర్మించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన స్టూడియోగా అన్నపూర్ణ స్టూడియో పేరు గాంచింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.



 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe